Theertham And Prasadam In Temple : ఆలయానికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు మన బాధలన్నీ కూడా మనం మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉంటాం. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని ఆ తర్వాత బయటికి రావాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఒక్క నియమాన్ని మాత్రమే కాకుండా ప్రసాదం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని కూడా చూసి తెలుసుకుని పాటించండి.
ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు. అలానే ప్రసాదం కూడా పెడతారు. శివుడి ఆలయానికి వెళ్ళినప్పుడు బిల్వతీర్థం ఇస్తారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసీదళం తీర్థం ఇస్తారు. అయితే తీర్థం కానీ ప్రసాదం కానీ ఇస్తే కొంత మంది వారి చేతులతో తీసుకుంటారు. కొంతమంది ఎవరైనా తీసుకుంటే వాళ్ళ చేతిలో నుండి మార్చుకుంటారు. అయితే ఎప్పుడూ కూడా గుడిలో ఇచ్చే తీర్థం విషయంలో కానీ ప్రసాదం విషయంలో కానీ తప్పులను చేయకూడదు.
గుడిలో చక్కెర పొంగలి, పులిహోర వంటివి ఇచ్చినప్పుడు కూడా కొన్ని పొరపాట్లని చేస్తుంటారు కొందరు. తీర్థం తీసుకోవాలి అంటే ఎడమ చేతి మీద, కుడి చేతిని పెట్టి తీర్థం తీసుకుని తర్వాత రెండు కళ్ళకి అద్దుకుని తర్వాత తీర్థాన్ని తాగాలి. చాలామంది తీర్థం తాగిన తర్వాత తలకి చేతులు రాసుకుంటారు. ఆ తప్పు అసలు చేయకూడదు. రెండు చేతుల్ని తుడుచుకోవాలి. స్త్రీలు తీర్థం, ప్రసాదం గుడిలో తీసుకునేటప్పుడు పైటకొంగుని చేతులతో పట్టుకుని పువ్వులు వంటివి ఇచ్చినప్పుడు పైటకొంగుతో అందుకోవాలి.
చక్కెర పొంగలి లాంటివి ఇస్తే కుడి చేత్తో తీసుకోవాలి. కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకున్నాక ఎడమ చేతిలోకి మార్చుకుని కొంచెం కొంచెం కుడి చేత్తో తినాలి. కానీ చాలామంది కుడి చేతిలోకి ప్రసాదం మొత్తం తీసుకుని, పక్షులు తిన్నట్టు తింటారు. అది తప్పు. అలా చేస్తే మళ్లీ జన్మలో పక్షై పుడతారని అంటారు. చూశారు కదా ప్రసాదం తినేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదనేది. ఇటువంటి తప్పులని ప్రసాదం తినేటప్పుడు అసలు చేయకండి మరి.