ప్ర‌శ్న - స‌మాధానం

Eating Non Veg Foods : ఆదివారం మాంసాహారం తిన‌వ‌చ్చా..? తింటే ఏమ‌వుతుంది..?

Eating Non Veg Foods : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక వెరైటీల‌కు చెందిన నాన్ వెజ్ వంట‌ల‌ను ఆర‌గించేస్తుంటారు. రుచిని బ‌ట్టి చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌లు.. ఇలా తింటుంటారు. అయితే చాలా మందికి ఎప్ప‌టి నుంచో ఒక సందేహం ఉంది. అదేమిటంటే.. ఆదివారం మాంసాహారం తిన‌వ‌చ్చా.. దీని గురించి ఎవ‌రైనా ఏమైనా చెప్పారా.. మాంసాహారాన్ని ఆదివారం తింటే ఏమ‌వుతుంది.. వంటి అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. అయితే ఇందుకు పురాణాలు చెబుతున్న స‌మాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వ కాలంలో ఆదివారం రోజు సూర్యుడికి పూజ‌లు చేసేవారు. ఆయ‌న స‌మ‌స్త ప్రాణికోటికి వెలుగును, శ‌క్తిని అందించే ప్ర‌దాత‌. క‌నుక సూర్య దేవున్ని పూజించేవారు. అందువ‌ల్ల ఆదివారం మాంసాహారం తినేవారు కాదు. ఇక వాస్తు ప్ర‌కారం కూడా ఆదివారం సూర్యుని నుంచి మ‌న‌లోకి పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌వేశిస్తుంద‌ట‌. అది మ‌న‌ల్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతుంద‌ట‌. అలాంటి స‌మయంలో మాంసాహారం తింటే మ‌న‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ట‌. క‌నుక ఆదివారం మాంసాహారం తిన‌కూడ‌ద‌ని చెబుతున్నారు.

can we eat non veg on sunday

అయితే ఈ ఆచారాలు, న‌మ్మ‌కాలు ఎలా ఉన్నా.. ఆదివారం మాంసాహారం తినే విష‌యంలో మాత్రం ఎవ‌రి వ్య‌క్తిగ‌త అభిప్రాయం వారిదే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒక‌రిని ఫ‌లానా రోజు అది తిన‌కూడ‌ద‌ని ఎవ‌రూ చెప్ప‌లేరు. ఆహార‌పు అల‌వాట్లు ఎవ‌రిష్టం వారివి. క‌నుక న‌మ్మ‌కం ఉన్న‌వారు ఆచారాల‌ను, వ్య‌వ‌హారాల‌ను పాటించ‌వ‌చ్చు. లేదంటే య‌థావిధిగా ఎప్పుడు ఏ రోజు ఏది కావాలంటే అది తిన‌వ‌చ్చు. అందులో అభ్యంత‌రం ఏమీ లేదు. ఆహారం ఎప్పుడు ఏది తినాల‌న్న‌ది ఎవ‌రిష్టం వారిది. క‌నుక దీనిపై ఒక‌రిపై బ‌ల‌వంతంగా ఒత్తిడి చేయ‌రాదు.

Admin

Recent Posts