వినోదం

‘సీత రామం’ సినిమాలో ‘సీతకి’ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే ?

దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్ గా హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మించిన మూవీ సీతారామం. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలక పాత్రలో నటించారు. దుల్కర్ సల్మాన్ ఈ పేరును తెలుగువారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కరలేదు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ మృనాల్ ఠాకూర్ తన అందం అభినయంతో ఆకట్టుకుంది. అదే సమయంలో స్నేహితురాలి హీరోయిన్ పాత్రలో నటించిన యువతి కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ యువతికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హీరోయిన్ స్నేహితురాలి పాత్ర చేసిన అమ్మాయి పేరు రుక్మిణి విజయ్ కుమార్.

do you know sita character friend in sita ramam movie

ఆమె నటి మాత్రమే కాదు, డాన్స్ కొరియోగ్రాఫర్. భరతనాట్యం కూడా నేర్చుకుంది. అయితే ఆమెది హైదరాబాద్ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కూడా నటించింది. అంతేకాదు ఆనందతాండవం అనే సినిమాలో కూడా రొమాంటిక్ పాత్ర చేసింది రుక్మిణి విజయ్ కుమార్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కచ్చాడియన్ సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించింది. సీతారామం పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Admin

Recent Posts