వినోదం

మీకు తెలుసా..? కృష్ణ‌కు 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి.. ఒక సంఘానికి చిరు ప్రెసిడెంట్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఘట్టమనేని కృష్ణ&comma; తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు&period; మూస పద్ధతిలో పోతున్న తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పించారు&period; కౌబాయ్&comma; సస్పెన్స్&comma; థ్రిల్లర్ లాంటి జోనర్లను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ&period; అన్నగారు ఎన్ టి రామారావు రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు&period; ఆయన అడుగుజాడల్లోనే నడిచారు సూపర్ స్టార్ కృష్ణ&period; అప్పటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణ ఎంతో మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉంచితే&comma; టాలీవుడ్ లో 5 దశాబ్దాల పాటు భిన్నమైన చిత్రాల్లో నటించిన కృష్ణకి అప్పట్లో ఏకంగా 2500 అభిమానుల సంఘాలు ఉండేవట&period; ఇందులోని ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి ప్రెసిడెంట్ గా ఉన్నారు&period; ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఒకసారి వెల్లడించిన చిరంజీవి&comma; కృష్ణ స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78519 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;krishna-2&period;jpg" alt&equals;"do you know that krishna have 2500 associations " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణ అభిమాన సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడు&comma; కర్ణాటకలోనూ ఉండేవట&period; 1981లో తోడుదొంగలు సినిమా రిలీజ్ కి ముందు పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అప్పట్లో ఓ కరపత్రం విడుదల చేశారు&period; అందులో ఆ ఫ్యాన్స్ యూనిట్ కి గౌరవ అధ్యక్షుడిగా చిరంజీవి పేరు ఉండడం గమనార్హం&period; అంతేకాదు&comma; కృష్ణతో కలిసి ఆ సినిమాలో చిరంజీవి కూడా యాక్ట్ చేశారు&period; ఇప్పుడు మరోసారి ఆ కరపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది&period; టాలీవుడ్ లో మూడు షిఫ్ట్ à°²‌లోను పనిచేసిన అతి కొద్ది నటుల్లో కృష్ణ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు&period; దాదాపు 340 కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ&comma; ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు&period; 1972లో కృష్ణ ఏకంగా 18 సినిమాల్లో యాక్ట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts