వినోదం

Yamudiki Mogudu : య‌ముడికి మొగుడు సినిమా క‌థ వెనుక‌.. ఇంత తంతు న‌డిచిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Yamudiki Mogudu &colon; టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period; వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సుప్రీం హీరోగా&period;&period; ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగారు&period; తన కృషి&comma; పట్టుదలతో స్టార్ హీరోగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజుగా ఏలారు చిరు&period; ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మరపురాని చిత్రాలు&period;&period; ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం&period; వీటిలో ఒకటి యముడికి మొగుడు&period; సాంఘిక చిత్రాలు చేసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న చిరంజీవి మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా ఎందుకు చేయడం అనుకున్న వారికి మరో హిట్ కొట్టి అందరి నోళ్లు మూయించాడు మెగాస్టార్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విజయశాంతి&comma; రాధ‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1988లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది&period; నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ యముడిగా నటించారు&period; చిరు మిత్రులైన నటులు జీవీ నారాయణరావు&comma; సుధాకర్&comma; హరిప్రసాద్ లు నిర్మాతలుగా వ్యవహరించారు&period; ఈ చిత్రంలో విజయశాంతి&comma; చిరంజీవి పోటీపడి నటించారు&period; ఇందులో పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి&period; సినిమాను చూసిన చాలా మంది దీనిని ఎన్టీఆర్ యమగోలను స్పూర్తిగా తీసుకుని చేశారని అనుకున్నారు&period; కానీ ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కిందంట&period; ఈ విషయాన్ని నటుడు నారాయణ రావు ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58289 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;yamudiki-mogudu&period;jpg" alt&equals;"do you know the story behind yamudiki mogudu movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1978లో వచ్చిన హెవెన్ కెన్ వెయిట్ అనే సినిమాకు వారెన్ బీట్టీ&comma; బక్ హెన్రీ సంయుక్తంగా దర్శకత్వం వహించగా&period;&period; వారెన్ బీట్టీ హీరోగా నటించారు&period; దీనిని చూసిన తాను సత్యానంద్ యముడికి మొగుడు కథను రూపొందించినట్లు నారాయణ రావు తెలిపారు&period; అయితే యమలోకం అనే పాయింట్‌ను నాగబాబు సూచించారని ఆయన చెప్పారు&period; అయితే ఈ తరహా కథలు రాయడంలో సిద్ధహస్తుడైన డీవీ నరసరాజు దగ్గరకు వెళ్లామని&period;&period; కానీ తాను ఇప్పటికే అలాంటి కథలు రాసి ఉండడంతో సబ్జెక్ట్ కు ఓకే చెప్పారని నారాయణ రావు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టోరీ డిస్కషన్ సమయంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే పెద్దలు చెప్పే మాటను సత్యానంద్ చెప్పారని ఆయన పేర్కొన్నారు&period; దీంతో సత్యానంద్ ని స్క్రీన్ ప్లే రైటర్ గా తీసుకుని&period;&period; ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లామని నారాయణ రావు తెలిపారు&period; ఇక ఈ సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది&period; అప్పటి వరకు సాధారణ నిర్మాతలుగా ఉన్న వారి జీవితాలే మారిపోయాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts