వినోదం

Tollywood : సినిమా ఇండ‌స్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారెవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Tollywood : సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్రేమ పెళ్లిళ్లు స‌హ‌జ‌మే. ఏదో ఒక స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ‌డం, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం వంటివి చేస్తుంటారు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో కొందరు హీరోలు ఒకటికి మించిన పెళ్లిళ్లు చేసుకున్నారు, వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ నుండి చూస్తే.. సీనియర్ ఎన్టీఆర్ 20 ఏళ్ల వయస్సులోనే తన మేనమామ కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు. బసవతారకం 1985లో గైనిక్ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఇక రెబల్‌స్టార్ కృష్ణంరాజుకు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య సీతా దేవి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు.

ఇక విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట వాణీగణపతిని వివాహం చేసుకోగా.. తరువాత సారికను పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు.అనంత‌రం గౌతమితో సహజీవనం చేశాడు. ఇక టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున మొదటగా లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో ఆయన హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నాడు. ఇక శరత్ బాబు మొదట నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఏవో విబేధాలు రావ‌డంతో వారు విడిపోయారు. అనంత‌రం స్నేహలత ను వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మరో జర్నలిస్టును వివాహం చేసుకున్నారు శ‌ర‌త్ బాబు.

do you know who married multiple times in tollywood

ప్రకాష్‌రాజ్ ముందుగా లలితకుమారిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విడిపోయాక బాలీవుడ్ డ్యాన్సర్ పోనీవర్మను పెళ్లి చేసుకున్నాడు. ;అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రష్యా అమ్మాయి అన్నా లెజ్నోవానుతో జీవనం సాగిస్తున్నారు. ఇక రెండు పెళ్లిళ్ల విషయంలో తండ్రి ఎన్టీఆర్‌నే అనుసరించాడు హ‌రికృష్ణ‌. 1973లో లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు.. ఈ దంపతులకు జానకీరామ్, కల్యాణ్ రామ్, సుహసిని జన్మించారు. అనంతర పరిణామాలతో హరికృష్ణ షాలినిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే జూనియర్ ఎన్టీఆర్.

Admin

Recent Posts