వినోదం

RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడ‌లా ఇప్పుడేమో ఇలా…!

థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్ఆర్ఆర్ సినిమా….. ఓటీటీ లో విడుదలైంది. ఓటీటీ లో పేపర్ వ్యూ విధానంతో తో విడుదల చేయగా అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే థియేటర్ లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా మరోసారి ఓటీటీలో చూస్తున్నారు. థియేటర్ లో ఉండే హంగామా కు కేవలం సినిమా కథను అందులోని జోక్స్ ను ఎంజాయ్ చేస్తారు కానీ ఓటీటీలో అలా కాదు. సినిమాను చాలా క్లారిటీగా చూస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ లోని కొన్ని మిస్టేక్ లను పట్టుకొని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మల్లి ని తీసుకువచ్చేందుకు వెళ్లిన ఎన్టీఆర్ ఒకే బోనులో పులులు, జింకలను తీసుకువెళతాడు. ఓకే బోన్ లో జింకలు, పులులను తీసుకెళ్లడం ఏంటి అని ఇప్పటికే ట్రోల్స్ వస్తుండగా ఇప్పుడు నెటిజన్లు మరో మిస్టేక్ ను కూడా పట్టేశారు. సినిమాలో రాహుల్ రామకృష్ణ ను మొదటిసారిగా రామ్ చరణ్ చూసినప్పుడు పెయింటింగ్ వేస్తూ కనిపిస్తాడు రామ్ చరణ్ ను చూడగానే అక్కడినుండి పారిపోతాడు.

have you identified this small mistake in rrr movie

కాగా ఎన్టీఆర్ స్నేహితుడిగా చరణ్ వచ్చినప్పుడు రాహుల్ రామకృష్ణ అతడి భుజంపై చేయి వేస్తాడు. కానీ అప్పుడు అతడి వేళ్ళకు ఎలాంటి రంగు కనిపించదు. కానీ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒలీవియా వెళుతున్న వాహనంపై అదే రంగుతో ఉన్న ఒక డిజైన్ చూడగా వెంటనే రాహుల్ రామకృష్ణ చేతివేళ్ళకు ఉన్న రంగును గుర్తు చేసుకుంటాడు. అప్పుడు రంగు కనిపిస్తుంది. ఇక ఈ మిస్టేక్ ని పట్టేసిన నెటిజన్లు మరోసారి జక్కన్న పై ట్రోల్స్ చేస్తున్నారు.

Admin

Recent Posts