వినోదం

Simran Natekar : ఈ యాడ్ లో నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Simran Natekar : ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికి పరిచయమే. ఎందుకంటే మనం సినిమా చూడటానికి ఏ థియేటర్ కి వెళ్లినా మొదట వచ్చే యాడ్ అదే. ధూమ‌పానానికి త‌ప్ప‌దు భారీ మూల్యం అనే యాడ్ లో ఈ పాప కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాప ఏం చేస్తుందో తెలుసా.. ? ఈ పాప పేరు సిమ్ర‌న్ న‌టేక‌ర్. ఈమె ఇప్పటికే అనేక హిందీ సీరియల్స్ లో నటించింది.

ఈ పాప హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అయినట్టు సమాచారం. చిన్నారి పెళ్లి కూతురులో పూజ పాత్ర‌లో న‌టించింది. క్రిష్‌-3 వంటి భారీ సినిమాల్లో కూడా న‌టించింది. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతుంది. లోబ‌డ్జెట్ సినిమాల‌తో కోట్లు కొల్ల‌గొట్టిన ఓ టాప్ బ్యాన‌ర్ సిమ్ర‌న్ న‌టేక‌ర్ ని తెలుగులో నటింపచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

have you remembered this kid in this ad

అయితే ఎంతో కాలంగా ఈమె తెలుగు సినిమాల్లో న‌టిస్తుంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. కానీ అవి వార్త‌లుగానే మిగిలిపోతున్నాయి. ఇక ఈమె కెరీర్ ఎలా మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Admin

Recent Posts