వినోదం

Chiranjeevi : మొదట ఫ్లాప్ టాక్ ను అందుకొని.. చివరకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిరంజీవి మూవీ ఏదో తెలుసా..?

Chiranjeevi : ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అగ్రస్థాయి హీరోగా ఎదిగారు. ప్రాణం ఖరీదు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఎన్నో బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అందులో ఒకటి మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్ పై నిర్మాత సుబ్బిరామిరెడ్డి సారథ్యంలో విడుదలైన చిత్రం స్టేట్ రౌడీ. ఈ స్టేట్ రౌడీ చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన భానుప్రియ, రాధ హీరోయిన్లుగా నటించి అందరినీ అలరించి మెప్పించారు.

మార్చి 23, 1989లో భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదలైన మొదటి రోజుల్లో ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఇదే చిత్రం కలెక్షన్ల‌ పరంగా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. అప్పట్లో స్టేట్ రౌడీ చిత్రం నైజాంలో కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసింది. స్టేట్ రౌడీ విడుదలైన సమయంలోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ లో ఉన్నారు. ఆ టైం లో అమితాబ్ బచ్చన్ సినిమాలు అంటే నిర్మాతలకు కనకవర్షం కురిపించేవి. కానీ చిరంజీవి స్టేట్ రౌడీ చిత్రంతో అమితాబచ్చన్ చిత్ర కలెక్షన్ల‌ను మించి వసూలు రాబట్టుకున్నారు. అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

this chiranjeevi movie got flop talk first but then hit

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ భారీ కలెక్షన్లు సంపాదించడంతో ట్రేడ్ గైడ్ అనే మ్యాగజిన్ స్టేట్ రౌడీ చిత్రం కలెక్షన్ల గురించి వివరిస్తూ వేర్ ఈజ్‌ అమితాబ్ అంటూ ప్రశ్నిస్తూ ఆర్టికల్ విడుదల చేసింది. అప్పటిలో ఈ మ్యాగజైన్ చదివిన హిందీ ప్రముఖులు సైతం వేర్ ఈజ్‌ అబితాబ్ అనే పదాన్ని చదివి ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం జరిగిందట. ఆ సమయంలో స్టేట్ రౌడీ చిత్రం దేశం మొత్తం రికార్డుల పరంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా వంద రోజుల వేడుకను ఘనంగా జరుపుకోవడంతోపాటు చిరంజీవి కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ మూవీ.

Share
Admin

Recent Posts