వినోదం

Abbas : హీరో అబ్బాస్ కెరీర్ నాశ‌నం అవ్వడానికి కార‌ణం అదేనా..?

Abbas : సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఒక్కోసారి జీవితాలు త‌ల‌కిందులు అవుతుంటాయి. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. తమదైన శైలి సృష్టించుకుని స్టార్ నటీనటులుగా ఎదుగుతారు. అయితే హిట్ ఫ్లాప్ లను, ఒత్తిడిని, పరాజయాన్ని అన్నింటినీ తట్టుకుంటూ.. కెరీర్ ను కొనసాగించే వారు కొంద‌రు అయితే మరి కొంద‌రు ఎగసి పడిన కెరటంలా.. తమకు వచ్చిన ఫేమ్ ని, అభిమానాన్ని తక్కువ సమయంలో కోల్పోయి.. కెరీర్ ను, సంపాదనను త‌మ జీవితాన్ని అయోమ‌యంలో ప‌డేసుకుంటారు. 90ల్లో అబ్బాస్ పేరు అంటే అమ్మాయిలు పడి చచ్చిపోయేవాళ్లు. అప్పటి వరకు అరవింద్ స్వామి అందగాడు అంటే ప్రేమ దేశం సినిమాతో అబ్బాస్ వచ్చాడు.

1996లో అబ్బాస్ న‌టించిన ప్రేమ దేశం విడుదలై రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఈ సినిమా స్పెష‌ల్ షోలు వేయించుకుని క‌లిసి చూశారు. అప్ప‌ట్లో దర్శ‌క నిర్మాత‌లు సైతం సినిమాల కోసం అబ్బాస్ ఇంటికి క్యూ క‌ట్టారు. దాంతో రెండేళ్లకు స‌రిప‌డా సినిమాల‌కు అబ్బాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కానీ స్టార్ ఇమేజ్ వ‌చ్చిన అబ్బాస్ లైఫ్‌ రెండో సినిమాకే ప‌త‌నం అవ్వ‌డం మొద‌ల‌యింది. క‌థ‌ల‌ను విన‌కుండా డ‌బ్బుకోసం వ‌చ్చిన ఆఫ‌ర్ల‌న్నింటికీ ఓకే చెప్ప‌డంతో అబ్బాస్ ప‌రిస్థితి దారుణంగా మారింది.

this is the reason why abbas career is spoiled

శంక‌ర్ జీన్స్ క‌థ‌తో అబ్బాస్ వ‌ద్ద‌కు రాగా డేట్స్ ఖాళీగా లేవ‌ని నో చెప్పాడు. మ‌రికొన్ని సినిమాల‌ను కూడా అబ్బాస్ మిస్ చేసుకున్నాడు. చివ‌రికి సినిమాల్లో చిన్న పాత్ర‌లు.. సీరియ‌ల్స్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. అవ‌మానాలు భ‌రించ‌లేక ఓ డిజైనర్ ను పెళ్లి చేసుకుని స్విట్జ‌ర్లాండ్ కు వెళ్లిపోయాడు. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన అబ్బాస్ కెరీర్ చాలా తక్కువ సమయంలోనే ముగిసిపోయింది. తనకున్న టాలెంట్ ను సరిగ్గా వినియోగించుకోలేక సినిమాల నుంచి సైడ్ అయిపోయాడు. మొదట్లో పెట్రోల్ బంక్ లో పనిచేశాడు. తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశాడు. అప్పుడే అక్కడ కనస్ట్రక్షన్ పనిపై పూర్తిగా పట్టు సంపాదించాడు. మెల్లగా బిల్డర్ గా మారాడు.

Admin

Recent Posts