Peacock Feathers : నెమలి ఈకలను హిందువులు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. శ్రీకృష్ణుడు నెమలి ఈకలనే ఫించాలుగా ధరిస్తాడు. అందువల్ల వాటికి ప్రత్యేకత ఏర్పడింది. అయితే నెమలి ఈకలను ఉపయోగించి మీకు ఉండే దోషాల నుంచి బయట పడవచ్చు. దీంతో సమస్యలు తొలగిపోతాయి. సంపదలు, ఆరోగ్యం కలుగుతాయి. అందుకు నెమలి ఈకలతో ఏం చేయాలంటే..
1. నెమలి ఈకలను 8 తీసుకుని వాటన్నింటినీ దగ్గరగా ఉంచి వాటి దిగువ భాగాలను ఒక తెల్లని దారంతో కట్టాలి. తరువాత ఓం సోమయే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి.
2. నెమలి ఈకలు 3 తీసుకుని వాటిని నల్లని దారంతో కలిపి కట్టాలి. అనంతరం తాంబూలంలో వాడే కొన్ని చెక్కలను ఉంచి వాటిపై నీటిని చల్లుతూ.. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. దీంతో శని దోషం నివారణ అవుతుంది.
3. మీ ఇంట్లో డబ్బులు ఉంచే చోట లేదా బీరువా, లాకర్‌లలో ఒక నెమలి ఈకను ఉంచాలి. దీంతో డబ్బు ఆకర్షితమవుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. డబ్బు చేతిలో నిలుస్తుంది. పొదుపు చేస్తారు.
4. నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉండే పెయింటింగ్ లేదా వాల్ పోస్టర్‌ను ఇంట్లో హాల్ లేదా లివింగ్ రూమ్‌లో ఉంచాలి. దీంతో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కష్టాలు పోతాయి.
5. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద నెమలి ఈకను ఇతరులకు కనిపించకుండా ఉంచాలి. దీంతో ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా, ఇతరుల దిష్టి తాకకుండా ఉంటుంది.
6. ఆఫీస్‌లో లేదా వ్యాపారం చేసేవారు తమ కార్యాలయంలో నెమలి పెయింటింగ్‌ను పెట్టుకుంటే కలసి వస్తుంది. ఉద్యోగులు కెరీర్‌లో రాణిస్తారు. వ్యాపారస్తుల వ్యాపారం సరిగ్గా జరుగుతుంది. లాభాలు వస్తాయి.
7. ఇంట్లో లేదా బయట ఎక్కడ నెమలి ఈకలను పెట్టినా సరే వాటిపై దుమ్ము, ధూళి లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే వాటితో ప్రయోజనాలు కలుగుతాయి.
8. నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల బల్లులు ఉండవు. క్రిమి కీటకాలు రావు.
9. బెడ్ రూమ్‌లో నెమలి ఈకలను లేదా పెయింటింగ్ లేదా పోస్టర్‌ను పెట్టుకుంటే దంపతుల మధ్య ఉండే కలహాలు పోయి అన్యోన్యంగా ఉంటారు. దాంపత్య జీవితం హాయిగా కొనసాగుతుంది.
10. నెమలి ఈకలను దగ్గర ఉంచుకుంటే జన్మ కుండలి ప్రకారం ఎదురయ్యే బలహీనతలు, గ్రహ ప్రభావాలు తగ్గుతాయి. దీంతో గ్రహదోషం పోతుంది.