Tollywood : జీవితంలో డిప్రెషన్, స్ట్రెస్, ఆనందం, దు:ఖం, ఏడుపు ఇలా ఎన్నో రకాల భావోద్వేగాలు మన చుట్టూ ఉంటాయి. ఎలాంటి ఎమోషన్ కి అయినా మ్యూజిక్ వింటే చాలా బాధను దూరం చేస్తుంది, సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. మన మూడ్ కి తగ్గట్లుగా ఎన్నో పాటలతో మైమరచిపోవచ్చు.
మ్యూజిక్ అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో పెరిగే పెట్స్ కి కూడా మ్యూజిక్ అంటే మహా ఇష్టం. అలాగే చిన్న పిల్లలకు మధుర స్వరంతో పాటలను పాడి వినిపిస్తే.. హాయిగా అన్నం తినేస్తారు, ప్రశాంతంగా నిద్రపోతారు. ఇక సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి రావాలంటే పాటలు హిట్ అవ్వాల్సిందే.
మరి అంత ప్రయారిటీ ఉన్న ఈ పాటల్ని పాడే సింగర్స్ కూడా సెలబ్రిటీలే. వారు పాడిన ఒక్కో పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా.. టాలీవుడ్ లో కొంతమంది ఫేమస్ సింగర్స్ రెమ్యునరేషన్ డీటైల్స్ ఎంటో తెలుసుకుందాం.
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం తాను పాడే ఒక పాటకు లక్ష రూపాయలు ఛార్జ్ చేసేవారట. అలాగే సింగర్ చిత్ర కూడా లక్ష రూపాయలు తీసుకుంటారు. టాలీవుడ్ లో ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ అయిన చిన్మయి శ్రీపాద తాను పాడే ఒక్కో పాటకు లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు.
సునీత 75 వేల రూపాయలు, సింగర్ రమ్య బెహ్ర 35000, కౌసల్య 45000, హేమచంద్ర 40000, గీతా మాధురి 45000, శ్రావణ భార్గవి 50000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనేది టాలీవుడ్ సినీ వర్గాల టాక్. ఇక సింగర్స్ గా వారు పాడే పాటలపైనే రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సింగర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాగే అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ తన పాటలతో మెస్మరైజ్ చేస్తున్న సిద్ శ్రీరామ్ టాప్ పొజిషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.