vastu

House Doors : ఇంట్లో ఎన్ని తలుపులు ఉండవచ్చు.. వాస్తు ప్రకారం ఎన్ని ఉండాలి..?

House Doors : చాలా మంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, అంతా బాగుంటుంది. చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. చాణక్య వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి కూడా అవుతుంది అని చెప్పారు. వాస్తు ప్రకారం, మనం అనుసరిస్తే చాలా సమస్యలు తొలగిపోయి, సంతోషంగా ఉండడానికి అవుతుంది. వాస్తు ప్రకారం, తలుపులు విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఎన్ని తలుపులు ఉండాలి అనేది తెలుసుకోవాలి. అలానే. తలుపులు ఏ వైపు ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం, తలుపులు 4 ఉండాలి. ఈ తలుపులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం వైపు ఉండాలి. ప్రధాన ద్వారం తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ ఉండాలి. ఉత్తరం, తూర్పు వైపు తలుపులు ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

how many doors in home according to vastu

తూర్పు వైపు ఆరోగ్యం, సంపదని సూచిస్తుంది. ఉత్తరం విజయాన్ని, ఆనందాన్ని సూచిస్తుంది. ఇంట్లో తలుపులు సరిగ్గా ఉండాలి. సరళరేఖలోనే ఉండాలి. వంకరగా, వక్రంగా ఉండకూడదు. ఒకవేళ కనుక అలా ఉన్నట్లయితే, ప్రతికూల శక్తి వస్తుంది. తలుపులు కూడా ఒక మోస్తరు పరిమాణంలోనే ఉండాలి. చిన్నవిగా కానీ పెద్దవిగా కానీ ఉండకూడదని వాస్తు శాస్త్రం చెప్తోంది.

వీటి వలన శక్తి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందట. సమస్యలు వస్తాయట. తలుపులు పొడుగ్గా, వెడల్పు తక్కువగా ఉండాలి. ఎక్కువ పొడవు కూడా ఇంటికి మంచిది కాదు. తలుపు కోసం ఉపయోగించే మెటీరియల్ ఎప్పుడు కూడా, దృఢంగా ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలో నాలుగు తలుపులు ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇలా, ఈ విషయాన్ని మీరు కనుక గుర్తుపెట్టుకొని ఆచరించినట్లయితే, అంతా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇబ్బందులు ఏమి కూడా ఉండవు.

Admin

Recent Posts