వినోదం

ఎస్పీ బాలుకి రోజా తండ్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో మధ్యతరం హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో రోజా కూడా ఒకరు.. సినిమాల ద్వారా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రోజా, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రియాల్టీ షోలలో జడ్జిగా కూడా చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం వైకాపా నాయ‌కురాలిగా కొనసాగుతున్నారు.. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో నాగరాజు రెడ్డి లలితా దంపతులకు జన్మించిన రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు రోజా గా మార్చుకొని తన సత్తా చాటింది.. రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా, ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో లాగా ఉన్న చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలకు దీటుగా నటించి సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

what is the relation between roja father and sp balu

రోజా తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ,మలయాళ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించింది.. కట్ చేస్తే రోజా తండ్రి నాగరాజు రెడ్డి కి దివంగత సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మంచి స్నేహితులు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.. వీరిద్దరు కలిసి పియుసి తిరుపతిలో చదువుకున్నారట. తన చిన్నతనంలో తండ్రి తో పాటు రోజా కూడా బాలుని చూడ్డానికి వెళ్లేదట. ఆ సమయంలో రోజా రెండు జుట్లు వేసుకొని సన్నగా పీలగా ఉండేదట.ఆమె బుగ్గలను గిల్లే వారట ఎస్పీ బాలు..

Admin

Recent Posts