వినోదం

రాజ‌మౌళి త‌న నెక్స్ట్ కు మ‌హేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఉన్న ప్రభాస్, రానా దగ్గుబాటి తో బాహుబలి లాంటి భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించి ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు రాజమౌళి. బాహుబలి తోనే పాన్ ఇండియా అనే ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండును కొనసాగిస్తూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే మరో మల్టీ స్టారర్ తీసి సక్సెస్ కొట్టారు జక్కన్న. అంతేనా, ఈ సినిమాతో ఆస్కార్ బరిలో నిలబడ్డారు.

అయితే, ఇప్పుడు మహేష్ బాబు సినిమాను కూడా భారీ మల్టీస్టారర్ గా మలిచే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారని టాక్.ప్రస్తుతం మహేష్ బాబు సినిమా ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు రాజమౌళి. అయితే ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం తన నెక్స్ట్ కోసం రాజమౌళి మహేష్ బాబు ని ఎందుకు ఎంచుకున్నాడు? అన్నదానిపై విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

why rajamouli selected mahesh babu for his next movie

అలాగే సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ని కూడా ఇచ్చారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, చాలా కాలంగా రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా చేయాలనుకున్నాడు. కానీ అతనికి ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు ఇలాంటి స్టోరీకి మహేష్ బాబు బెస్ట్ ఎంపిక అని అతను భావించాడు. మహేష్ బాబు చాలా ఇంటెన్స్ యాక్టర్. ఏ పాత్రలో కైనా సులభంగా షిఫ్ట్ కాగలడు. అందుకే మహేష్ ను ఎంచుకున్నాడు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ సినిమా రెగ్యులర్ షూట్ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ మూవీ అప్ డేట్స్ కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Admin

Recent Posts