పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే స్టార్ హీరోకు లేని క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉందనే సంగతి తెలిసిందే. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2003లో పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టించారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వైరల్ అయిన వార్తలను చాలామంది నిజమేనని నమ్మారు. పవన్ కళ్యాణ్ గుండు చేయించుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే అప్పుడు అటు పవన్ కళ్యాణ్ కానీ, పరిటాల రవి కానీ ఈ వివాదం గురించి నోరు విప్పకపోవడంతో ఈ వార్త నిజమో కాదో అని అభిమానులకు కూడా అర్థం కాలేదు. ఇక ఈ విషయం గురించి గతంలో వైసిపి మంత్రులు బహిరంగంగా ఈ ప్రస్తావనకు తీసుకువచ్చారు. చిరంజీవికి, పరిటాల రవికి ఒక భూమి సమస్య కారణంగా గొడవ చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఆ గొడవ మధ్యలోకి వెళ్లి సంచలనం సృష్టించారని.. దాంతోనే పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించారంటూ వార్తలు వచ్చాయి. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ ఈ విషయం పై స్పందించారు. పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు.
పవన్ కళ్యాణ్ ఓ మంచి నటుడు. ఆయనకి సొసైటీ మీద ఎంతో ప్రేమ ఉంది. ఒక నాయకుడు ఎదిగే క్రమంలో ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. రాజకీయాలలో ఉన్నప్పుడు ఇలాంటి రూమర్లు రావడం సర్వసాధారణం. ఇలాంటి ఆరోపణలలో నిజం ఉంటే స్పందించాలి కానీ.. నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఎలా స్పందిస్తాం. పవన్ కళ్యాణ్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి పుకార్లకు పులిస్టాప్ పెట్టాలి అన్నారు పరిటాల శ్రీరామ్.