Jogging Health Benefits : బరువు తగ్గడానికి, శరీరం ఆరోగ్యం ఉండడానికి మనం అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. మనం రోజూ చేసే వివిధ రకాల వ్యాయామాల్లో జాగింగ్ కూడా ఒకటి. జాగింగ్ చేయడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ కనీసం 20 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేయడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేయడం వల్ల మనకు కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. జాగింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తప్రసరణ వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. జాగింగ్ చేయడం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. 20 నిమిషాల పాటు జాగింగ్ చేయడం వల్ల మనం 1000 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో మనం సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. రోజూ జాగింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. జాగింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. జాగింగ్ చేయడం వల్ల కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. రోఊ జాగింగ్ చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని కనుక ప్రతి ఒక్కరు రోజూ జాగింగ్ తప్పకుండా చేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు.