food

ఘుమఘుమ‌లాడే ధాబా స్టైల్ దాల్ త‌డ్కా.. ఇలా చేయండి..!

సాధార‌ణంగా ప‌ప్పుతో చేసుకునే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు అనేక ర‌కాల పప్పు వంట‌కాలు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దాల్ త‌డ్కా ఒక‌టి. దీన్ని ధాబాల్లో అద్భుతంగా చేస్తారు. అయితే కొద్దిగా శ్ర‌మించాలే గానీ మ‌నం ఇంట్లోనూ ధాబా స్టైల్‌లో దాల్ త‌డ్కాను చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. మ‌రి దాల్ త‌డ్కాను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

దాల్ త‌డ్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

కందిపప్పు- 1/2 కప్పు, పెసరపప్పు- 1/2 కప్పు, శనగపప్పు- 1/4 కప్పు, మైసూర్ పప్పు- 1/4 కప్పు, చిన్న ఉల్లిపాయ – 1, చిన్న టమాటా – 1, పచ్చిమిర‌పకాయ‌లు – 2, అల్లం – చిన్నముక్క, ధనియాలపొడి – 1/4 టీ స్పూన్, గరం మసాలా- 1/4 టీ స్పూన్, ఉప్పు- 1/2 టీ స్పూన్, పసుపు- 1/4 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,ఇంగువ- 1/2 టీ స్పూన్, కసూరి మేథీ- 1/4 టీ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – 1/4 కప్పు, చింతపండు రసం – 2 టీ స్పూన్లు.

dal tadka recipe in telugu make like this

దాల్ త‌డ్కా త‌యారీ విధానం:

పైన చెప్పిన ప‌ప్పుల‌న్నింటినీ క‌లిపి కుక్క‌ర్‌లో మెత్త‌గా ఉడికించుకోవాలి. బాణ‌లి తీసుకుని అందులో నెయ్యి వేసి వేడెక్కాక‌.. జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండు మిర‌ప‌కాయ‌లు, ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. అనంత‌రం అందులో క‌ట్ చేసిన ఉల్లిపాయ‌, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు, ట‌మాటాల‌ను వేసి బాగా వేయించుకోవాలి. అనంత‌రం అందులో ఉప్పు, ప‌సుపు కూడా వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మెత్త‌గా ఉడికిన ప‌ప్పు మిశ్ర‌మాన్ని మ‌రింత మెత్త‌గా చేసి పోపులో వేయాలి. ఆ త‌రువాత ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, క‌సూరీ మేథీ వేసుకోవాలి. అవ‌సరం అనుకుంటే అందులో చింత పండు ర‌సం కూడా క‌లుపుకోవ‌చ్చు. ఆ త‌రువాత ప‌ప్పును బాగా క‌లిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంత‌రం దానిపై కొత్తిమీర వేసి దింపాలి. అంతే.. ఘుమ ఘుమ‌లాడే దాల్ త‌డ్కా త‌యార‌వుతుంది. దీన్ని చ‌పాతీలు లేదా అన్నంతో లాగించేయ‌వ‌చ్చు..!

Admin

Recent Posts