food

Egg Masala Recipe : వంట రాని వారు కూడా ఎగ్ మ‌సాలాను ఈజీగా ఇలా చేసెయొచ్చు..!

Egg Masala Recipe : ఒక్కొక్కసారి, ఏదైనా స్పీడ్ గా వండేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాచులర్స్ స్పీడ్ గా అయ్యిపోయే, రెసిపీస్ ని ట్రై చేస్తూ ఉంటారు. అరగంటలో ఎగ్ మసాలా తయారు చేసుకోవచ్చు. ఈసారి ఇలా గుడ్డు ని వండండి. ఇక అసలు వదిలిపెట్టరు. చపాతి, అన్నం లోకి కూడా ఈ గ్రేవిని మనం తీసుకోవచ్చు. ఇక మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి..? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనే విషయాన్ని చూద్దాం. ఎన్ని గుడ్లు వేసుకుంటే, దానికి తగ్గట్టుగా మిగిలిన పదార్థాలని కూడా తీసుకోవాలి. మూడు మీడియం సైజు ఉల్లిపాయలు, మూడు చిన్న సైజు టమాటాలు కట్ చేసుకుని పెట్టుకోండి.

అలానే మిరపకాయలను కూడా కట్ చేసుకుని పెట్టుకోండి. కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం కొంచెం తీసుకోండి. ఒక ఎనిమిది గుడ్లు వరకు తీసుకోవాలనుకుంటే, ఈ కొలతల్ని ఫాలో అయిపోండి. ముందు కోడి గుడ్డు ని ఉడకపెట్టి, పైన పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఉడికించిన గుడ్డుకు నాలుగు వైపులా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా చేయడం వలన గుడ్డు లోపలికి మసాలా వెళ్తుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని, నాలుగు చెంచాల వరకు నూనె వేసుకుని, ఉడికించిన గుడ్లు వేసి, రెండు నిమిషాలు వేయించుకోవాలి.

you can make egg masala very easily

ఇప్పుడు గుడ్లు ని పక్కన పెట్టేసుకోవాలి. అదే పాన్ లో నూనె ఉంటుంది కాబట్టి, అందులో ఆవాలు వేసి చిటపటమన్నాక, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి, బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకుని, అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటాలు బాగా ఉడికాక మసాలా దినుసులు వేసుకోవాలి.

ఒక చెంచా కారం, ఒక చెంచా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలుపుకోండి. చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకోవాలి. మసాలా చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, గ్లాసు వరకు నీళ్లు పోసుకోండి. బాగా మరిగేటప్పుడు ఉడికించిన గుడ్లు వేసుకోవాలి. ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసుకోవాలి. కొన్ని నిమిషాలు ఉంచిన తర్వాత మసాలా అంతా కూడా గుడ్డుకు బాగా పట్టుకుంటుంది. స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే.

Admin

Recent Posts