Whiteland Virus : చైనాలో మ‌రో ప్రాణాంత‌క వైర‌స్ విజృంభ‌ణ‌..!

Whiteland Virus : ఇప్పుడు ప్ర‌జ‌ల‌ని వైర‌స్ భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నాయి.కొత్త కొత్త ర‌కాల వైర‌స్‌లు పుట్టుకొస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. క‌రోనా వైర‌స్ ఎంత భ‌యాన‌కం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. వెట్‌ల్యాండ్ అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు. వెట్ ల్యాండ్ వైరస్‌ను మొదట 2019లో గుర్తించారు. మంగలోలియాలోని చిత్తడి నేలకు చెందిన ఓ 61ఏళ్ల వృద్ధుడు అప్పట్లో అనారోగ్యానికి గురయ్యాడు. ఐదురోజుల పాటు జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి.

ఇది పరాన్న జీవుల ద్వారా వ్యాపిస్తుంది. పందులు, గొర్రెలు, గుర్రాల్లోనూ E.W.L.V R.N.Aను ఇది వరకే గుర్తించారు. జంతువుల్లోని రక్తనాళాల్లో నిర్మాణాత్మక మార్పుల కలిగించి ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చైనా ఎంతటి అపఖ్యాతిని మూటగట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 70 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ఆ వైరస్ ఏమంత ప్రభావం చూపడంలేదు.

Whiteland Virus is spreading in china know about it
Whiteland Virus

వెట్ ల్యాండ్ వైర‌స్ ఐదేళ్ల కిందటే బయటపడింది. తొలిసారిగా జిన్ జౌ నగరంలో 61 ఏళ్ల వృద్ధుడిలో కనుగొన్నారు. ఈ వైరస్ కారణంగా రోగిలో జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే… ఇది యాంటీబయాటిక్ ఔషధాలకు కూడా లొంగని మొండి వైరస్ అని పరిశోధకులు అంటున్నారు. ఈ వెట్ ల్యాండ్ వైరస్ గొర్రెలు, పందులు, గుర్రాల్లో పేల ద్వారా వ్యాప్తి చెందుతుందని, తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని గుర్తించారు. ఇది మెదడుపై ప్రభావం చూపుతుందని, తద్వారా రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Sam

Recent Posts