Mutton Bones Soup : మాంసాహార ప్రియుల్లో చాలా మందికి మటన్ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తలకాయ, బోటి, పాయా.. లాంటి పదార్థాలను కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మటన్ బోన్స్‌తో సూప్ తయారు చేసుకుని కూడా తాగవచ్చు. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోన్స్ సూప్ ను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బోన్స్ సూప్‌లో గెలాటిన్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
2. బోన్స్ సూప్ శక్తివంతమైన డిటాక్సిఫికేషన్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకుపోతాయి. లివర్, జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతాయి.
3. బోన్స్ సూప్‌ను తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
4. బోన్స్ సూప్ తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
5. బోన్స్ సూప్ తాగడం వల్ల కాల్షియం అధికంగా లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. విరిగిన ఎముకలు ఉన్నవారు రోజూ బోన్స్ సూప్‌ను తాగితే అవి త్వరగా అతుక్కుంటాయి. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.