TECNO Spark 8C : కేవ‌లం రూ.7వేల‌కే టెక్నో కొత్త 4జి స్మార్ట్ ఫోన్‌..!

TECNO Spark 8C : మొబైల్స్ త‌యారీదారు టెక్నో.. స్పార్క్ 8సి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా చాలా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ల‌ను రూపొందించి అందించ‌డంలో టెక్నో పేరుగాంచింది. అందులో భాగంగానే ఈ ఫోన్‌ను ఆ సంస్థ లాంచ్ చేసింది. ఇక ఇందులో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ ఫోన్‌లో.. 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్‌లో 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. అవ‌స‌రం అనుకుంటే వ‌ర్చువ‌ల్ గా ర్యామ్ ను మ‌రో 3జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఇక మెమొరీ కార్డు కోసం ప్ర‌త్యేకంగా స్లాట్‌ను కూడా ఇచ్చారు.

TECNO Spark 8C  smart phone launched in India
TECNO Spark 8C

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిష‌న్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉంది. డ్యుయ‌ల్ సిమ్ వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. మ‌రో సెకండ‌రీ ఏఐ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది. డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.

టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.7,499 ఉండ‌గా.. దీన్ని ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ నుంచి అమెజాన్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Editor

Recent Posts