Barley Water For Diabetes : చాలామంది, ఈ రోజుల్లో డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నట్లయితే, ఈ నీటిని రోజు తాగండి. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ఈ రోజుల్లో ప్రతి వయసు వారిలో కూడా ఉంటుంది. చిన్న వయసు వాళ్ల నుండి, పెద్ద వయసు వాళ్ల వరకు చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. మారిపోయిన జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి ఇలా రకరకాల కారణాల వలన, చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది.
డయాబెటిస్ వున్న వాళ్ళు, డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకునే ఆహార పదార్థాలను తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు ఫైబర్ సమృద్ధిగా ఉండే, ఆహారాలను తీసుకోవాలి. ఇటువంటి ఆహారాలను తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శనగల్లో డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా, శనగల్ని తీసుకుంటే, రక్తం లోని చక్కెర ని కంట్రోల్ చేయగలదు. ప్రతిరోజు ఒక బౌల్లో ఒక స్పూన్ శనగలను వేసి, నీళ్లు పోసి రాత్రి సమయంలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తీసుకుంటే సరిపోతుంది.
శనగల్లో ఉన్న 100% పోషకాలు, శరీరానికి బాగా అందుతాయి. ఇక ఇది ఇలా ఉంటే, బార్లీలో దాదాపు 6 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. బార్లీ తీసుకుంటే కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ తగ్గడానికి సహాయపడుతుంది. బార్లీ తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. వాపు కూడా తగ్గుతుంది.
ఒక స్పూన్ బార్లీ గింజల్ని, గ్లాసు నీళ్లలో వేసి ఉడికించి ఆ నీటిని వడకట్టి తీసుకోవాలి. సబ్జా గింజలు తీసుకుంటే కూడా మంచిది. జీర్ణ క్రియ ని తగ్గించి, పిండి పదార్థాలను త్వరగా గ్లూకోస్ గా మార్చడానికి సబ్జా బాగా ఉపయోగపడుతుంది. సబ్జా గింజలు డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆహార పదార్థాలను కనుక మీరు తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.