Beetroot Juice For Kidneys : మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. మూత్రపిండాల ఆరోగ్యంపైనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో ఉండే రక్తాన్ని ఇవి నిరంతరం వడపోస్తూనే ఉంటాయి. మన శరీరంలో ఉండే 5 లీటర్ల రక్తాన్ని రోజుకు దాదాపు 48 సార్లు మూత్రపిండాలు వడపోస్తూ ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేసి అందులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడంలో మూత్రపిండాలు మనకు సహాయపడతాయి. మూత్రపిండాలకు రక్తం సరిగ్గా అందక తక్కువగా సరఫరా అవ్వడం వల్ల అవి తక్కువ మోతాదులో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇలా తక్కువగా శుద్ధి చేయడం వల్ల తక్కువ మోతాదులో వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో రక్తంలో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోయి అనారోగ్య సమస్యలు తలెత్తూ ఉంటాయి. అందుకే మూత్రపిండాలు వైఫల్యంతో బాధపడే వారికి డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు.
రక్తం చక్కగా శుద్ధి అయ్యి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మూత్రపిండాలకు రక్తం ఎక్కువగా సరఫరా అవ్వాలి. మూత్రపిండాలకు రక్తాన్ని సరఫరా చేసే మూత్రనాళాలు బీపీ, ఇన్ఫెక్షన్ వంటి వివిధ కారణాల చేత ముడుచుకుపోతాయి. దీంతో మూత్రపిండాలకు రక్తసరఫరా తగ్గుతుంది. రక్తనాళాలు ముడుచుకుపోవడాన్ని తగ్గించి ఎక్కువగా సాగేలా చేసి రక్తసరఫరా చక్కగా అయ్యేలా చేయడంలో మనకు బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బీట్ రూట్ లో నైట్రేట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తరువాత నైట్రిక్ యాసిడ్ గా మారుతుంది. ఈ నైట్రిక్ యాసిడ్ రక్తంలో చేరడం వల్ల రక్తనాళాలు ఎక్కువగా సాగుతాయి.
దీంతో మూత్రపిండాలకు రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. దీంతో రక్తం ఎక్కువగా శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే మలినాలు, వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. దీంతో మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. మన శరీరంలో ఉండే మూత్రపిండాలకు బీట్ రూట్ ఈవిధంగా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పరిశోధనల్లో వెల్లడైంది. యూనివర్సిటి ఆఫ్ బఫెల్లో , యూ ఎస్ ఎ వారు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అలాగే బీట్ రూట్ లో బిటాలిన్స్ అనే రసాయనాలు మూత్రపిండాల ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో అలాగే రక్తం యొక్క పి హెచ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతున్నాయని వారు కనుగొన్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాలు వడపోసే సామర్థ్యం కూడా చాలా మందిలో తగ్గుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన ఇటువంటి సమస్యల బారిన మనం పడకుండా ఉండాలంటే మనం తరచుగా బీట్ రూట్ ను జ్యూస్ ను తాగాలి. ఈ విధంగా బీట్ రూట్ మనకు ఎంగానో ఉపయోగపడుతుందని దీనిని జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.