Cabbage Pachadi : క్యాబేజీతోనూ ఎంతో రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Cabbage Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాబేజి కూడా ఒక‌టి. క్యాబేజి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజితో కూర‌లే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాబేజిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. ఈ ప‌చ్చ‌డిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, సుల‌భంగా క్యాబేజి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన క్యాబేజ్ – పావు కిలో, త‌రిగిన ట‌మాటాలు – 3, ప‌చ్చిమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ప‌సుపు – అర టీ స్పూన్, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5.

Cabbage Pachadi recipe in telugu make in this method
Cabbage Pachadi

క్యాబేజి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ప‌చ్చిమిర్చి చ‌క్క‌గా వేగిన త‌రువాత క్యాబేజ్, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి క్యాబేజీని మ‌గ్గించాలి. క్యాబేజి చ‌క్క‌గా మ‌గ్గిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, చింత‌పండు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి.

తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ప‌చ్చ‌డిని వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన క్యాబేజి ప‌చ్చ‌డిని అంద‌రు లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు. క్యాబేజితో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts