Billa Ganneru For Diabetes : బిళ్ల గన్నేరు మొక్క.. దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు. ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే పెరిగే పూల మొక్క ఇది. రకరకాల అందమైన పూలతో ఈ మొక్క ఎప్పుడూ పచ్చగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ మొక్క సంవత్సరమంతా పూలు పూస్తేనే ఉంటుంది. దీనిని నిత్య పుష్పి, సదా పుష్పి, సదా బహార్ అనే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క ఏడు నుండి 24 అంగుళాల వరకు పెరుగుతూ ఉంటాయి. వీటిలో వివిధ రంగుల పూలు పూసే మొక్కలు ఉన్నప్పటికి తెలుపు, పింక్ రంగుల్లో ఉండే మొక్కలోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బిళ్ల గన్నేరులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను ఎంతో కాలంగా ఔషధంగా ఉపయోగిస్తున్నారని మనలో చాలా మందికి తెలియదు.
రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క మనకు ఎంతో దోహదపడుతుంది. క్యాన్సర్ ను నివారించే వివిధ రకాల ఔషధాల్లో ఈ మొక్కను ఉపయోగిస్తారు. ముక్కు నుండి రక్తకారడం, దంతాలు మరియు చిగుళ్లకు సంబంధించిన సమస్యలను, గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క సహాయపడుతుంది. చర్మ వ్యాధులతో బాధపడే వారు దద్దుర్లతో బాధపడే వారు ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ బిళ్ల గన్నేరు ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఈ ఆకులను ఆరబెట్టి నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను కండరాలపై రాస్తూ మర్దనా చేయడం వల్ల కండరాల నొప్పులు, కండరాల వాపులు తగ్గుతాయి.
ఈ మొక్క వేరును రెండు గ్లాసుల నీటిలో వేసి ఒకగ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిలో మిరియాల పొడి వేసి కలిపి తీసుకోవడం వల్ల 48 రోజుల్లోనే షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఇలా తయారు చేసుకున్న నీటిని తాగడం వల్ల మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి. మొలల వ్యాధితో బాధపడే వారు బిళ్ల గన్నేరు పూల రేకులను నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయంతో మొలలను కడుగుతూ ఉంటే మొలల సమస్య తగ్గు ముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బిళ్ల గన్నేరు మొక్క ఆకులను, పూలను మెత్తగా నూరి అందులో పెరుగు, కొబ్బరి నూనె కలిపి జుట్టుకు ప్యాక్ లా వేసుకోవాలి.
ఇలా వారినికి ఒకసారి ఈ చిట్కాను పాటించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. పురుగులు, కీటకాలు కుట్టిన చోట ఈ బిళ్ల గన్నేరు మొక్క ఆకులపేస్ట్ ను రాస్తూ ఉంటే కీటకాలు కుట్టడం వల్ల కలిగే నొప్పి, వాపు తగ్గుతాయి. అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఈ మొక్కను ఉపయోగించకపోవడమే మంచిది. బిళ్ల గన్నేరు మొక్క అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో మనకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.