Biotin Foods For Hair : జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ నేటి తరుణంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్కెట్ లో లభించే అన్ని రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. అనేక రకాల చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో జుట్టు బలహీనంగా తయారవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బాహ్యంగా చిట్కాలను ప్రయోగిస్తే మాత్రమే సరిపోదు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలను కూడా తీసుకోవాలి. జుట్టు పెరుగుదలకు బయోటిన్ ఎంతో అవసరమవుతుంది. దీనిని విటమిన్ బి7 లేదా విటమిన్ హెచ్ అని పిలుస్తారు. జుట్టును ఆరోగ్యంగా, బలంగా, ధృడంగా, పొడవుగా పెరిగేలా చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. బయోటిన్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి.
జుట్టుకు లోపలి నుండి పోషణ లభిస్తుంది. జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డు పచ్చసొనలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. గుడ్డును రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. చేపలల్లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లతో పాటు బయోటిన్ కూడా ఉంటుంది. క్రమం తప్పకుండా చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. అవకాడో లో కూడా బయోటిన్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే బాదంపప్పు, వాల్ నట్స్ వంటి గింజలల్లో కూడా బయోటిన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అదే విధంగా తియ్యగా ఉండే చిలగడదుంపలల్లో కూడా బయోటిన్ ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా తయారవుతుంది. అలాగే బచ్చలికూరలో కూడా బయోటిన్ ఉంటుంది. బచ్చలికూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టును మనం సొంతం చేసుకోవచ్చు. అలాగే ఓట్స్, బార్లీ, క్వినోవా వంటి ధాన్యాలల్లో కూడా బయోటిన్ ఉంటుంది.
ఈ ధాన్యాలను తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. అలాగే పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులల్లో కూడా బయోటిన్ ఉంటుంది. పాలను లేదా పాల ఉత్పత్తులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చక్కటి ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఇక బయోటిన్ ఉండే ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే చికెన్ లో కూడా బయోటిన్ ఉంటుంది. చికెన్ ను తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లకు చక్కటి పోషణ లభిస్తుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల బయోటిన్ చక్కగా అందుతుంది. దీంతో జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతుంది.