Black Beans : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో బ్లాక్ బీన్స్ కూడా ఒకటి. ఇవి చూడడానికి నల్లగా చిక్కుడు గింజల ఆకారంలో ఉంటాయి. వీటిని కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర పప్పు దినుసుల వల్లె బ్లాక్ బీన్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బ్లాక్ బీన్స్ లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. బ్లాక్ బీన్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ బీన్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో బ్లాక్ బీన్స్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. వీటిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల మనం పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బీన్స్ లో నిత్యం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా షుగర్ అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
వీటిని కొద్ది మోతాదులో తీసుకోగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యల బారిన మనం పడకుండా ఉంటాము. బ్లాక్ బీన్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో సంతాన సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో ఉండే పోషకాలు నాడీ మండల వ్యవస్థ సమర్థవంతంగా పని చేసేలా చేయడంలో సహాయపడతాయి. అదే విధంగా బ్లాక్ బీన్స్ లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు బ్లాక్ బీన్స్ ను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా ఈ బీన్స్ లో ఉంటుంది. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. బ్లాక్ బీన్స్ తో చాట్, కూరలు, సలాడ్ వంటి వాటిని తయారు చేసుకుని తినడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.