Blood Increasing Foods : సాధారణంగా పురుషులల్లో 5 లీటర్ల రక్తం, స్త్రీలల్లో నాలుగున్నర లీటర్ల రక్తం ఉంటుంది. రక్తకణాలు ఎక్కువగా తయారవ్వాలన్నా, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉండాలన్నా తగినంత ఐరన్ ఉండడం చాలా అవసరం. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి వైద్యులు ఎక్కువగా ఐరన్ క్యాప్సుల్స్ ని, ఐరన్ సిరప్ ని సూచిస్తూ ఉంటారు. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఎక్కువగా వీటిని ఉపయోగించి సమస్య నుండి బయటపడుతూ ఉంటారు. ఇలా మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్ద ఆహారాలను తీసుకుని కూడా మనం రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. దీని కోసం మనం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మన శరీరానికి రోజుకు 30 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరమవుతుంది.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. ఐరన్ ఎక్కువగా ఆహారాల్లో తోటకూర కూడా ఒకటి. 100 గ్రాముల తోటకూరలో 39 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. కనుక తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. తోటకూరను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత సోడియంతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఇలా తోటకూరను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అదే ఐరన్ క్యాప్సుల్స్ ను వాడడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందలేము.
కనుక శరీరానికి కావల్సిన ఐరన్ కోసం క్యాప్సుల్స్ కు బదులుగా తోటకూరను తీసుకోవడం మంచిది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాల్లో క్యాలీప్లవర్ కాడలు కూడా ఒకటి. మనం సాధారణంగా క్యాలీప్లవర్ ను తీసుకుని వాటి కాడలను పడేస్తూ ఉంటాము. కానీ క్యాలీప్లవర్ కాడల్లో 40 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. వీటిని పడేయకుండా వీటితో కూడా కూర వండుకుని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా క్యాలీప్లవర్ కాడలను తీసుకోవడం వల్లకూడా శరీరానికి తగినంత ఐరన్ లభించి రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. ఇక తవుడును తీసుకోవడం వల్ల కూడా శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. 100 గ్రాముల తవుడులో 45 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది.
తవుడును నేరుగా తినడం కానీ దానితో లడ్డూలను చేసుకుని తినే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.అదే విధంగా అవిసె గింజలల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల అవిసె గింజలల్లో 100 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. అవిసె గింజలను వేయించి కారం పొడి తయారు చేసి తీసుకోవడం వల్ల తగినంత ఐరన్ లభిస్తుంది. ఈ విధంగా సహజ సిద్ద ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా మనం తగినంత ఐరన్ ను పొందవచ్చని రక్తహీనత సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.