Egg Yolk : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. కోడిగుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు అందుతాయి. కోడిగుడ్డును ఉడికించి తీసుకోవడంతో పాటు దీనితో రకరకాల వంటకాలను కూడా తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది కోడిగుడ్డు తెల్లసొనను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్డులో ఉండే పచ్చసొనను తీసుకోరు. ఉడికించిన కోడిగుడ్డులో తెల్లసొనను తిని పచ్చసొనను పడేస్తూ ఉంటారు. అసలు కోడిగుడ్డు పచ్చసొనను తినాలా.. వద్దా…? పచ్చసొనను తింటే ఏమౌతుంది.. వంటి వివరాలను తెలుసుకుందాం. కోడిగుడ్డుపచ్చసొనను కూడా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలో కూడా విటమిన్ ఎ, డి, ఇ, కె, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
పచ్చసొనను తీసుకోవడం వల్ల మినరల్స్, విటమిన్స్ వంటి మన శరీరానికి చక్కగా అందుతాయి. పచ్చసొనలో ఉండే కోలిన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే గుడ్డు పచ్చసొనలో లుటీన్,జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే కోడిగుడ్డు పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మన శరీర బరువు అదుపులో ఉంటుంది. కోడిగుడ్డు పచ్చసొనను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము.
అలాగే దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే విటమిన్ డి, క్యాల్షియం ఎముకలను ధృడంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే గుడ్డు పచ్చసొనను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా గుడ్డు పచ్చసొనలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయని దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని కనుక గుడ్డు పచ్చసొనను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డు పచ్చసొన మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వారు దీనికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
గుడ్డు పచ్చసొనను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుడ్డు పచ్చసొనను తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కొందరిలో గుడ్డు పచ్చసొన అలర్జీని కలిగించే అవకాశం ఉంది. సరిగ్గా ఉడికించని పచ్చసొనను తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే కొందరిలో ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. కనుక గుడ్డు పచ్చసొనను తీసుకున్నప్పటికి తక్కువ మోతాదులో శరీర అవసరాలను బట్టి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.