Carom Seeds Water : మన ఇంట్లో ఉండే మసాలా దినుసుల్లో వాము ఒకటి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఎంతో కాలంగా వామును మనం వంటల్లో ఉపయోగిస్తూ ఉన్నాం. వాము చక్కటి వాసనను, ఘాటు రుచిని కలిగి ఉంటుంది. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వాత, పిత దోషాలను నయం చేయడంలో వాము మనకు ఎంతో ఉపయోగపడుతుంది. వామును ఉపయోగించడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఎసిడిటి, కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, కడుపులో నులి పురుగులు, రక్తపోటు, డయాబెటిస్, గుండె సమస్యలను నయం చేయడంలో కూడా వాము మనకు సహాయపడుతుంది.
వామును ఉపయోగించడం వల్ల దాదాపు 80 శాతం అనారోగ్య సమస్యలను మనం దూరం చేసుకోవచ్చు. అయితే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి వామును ఎలా ఉపయోగించి, ఎప్పుడు తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వామును మనం నీళ్లతో, పాలతో, మజ్జిగతో, ఉప్పుతో తీసుకోవచ్చు. అలాగే వంటల్లో వేసుకోవచ్చు. రోజూ రాత్రి ఒక గ్లాస్ నీళ్లల్లో ఒక టీ స్పూన్ వామును వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని కొద్దిగా వేడి చేసుకుని తాగి వామును నమిలి తినాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా వాము నీటిని తీసుకోవడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. వాము నీటిని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు నొప్పితో బాధపడే వారు ఈ వాము నీటిని కొద్దిగా వేడి చేసి అందులో నల్ల ఉప్పు వేసుకుని కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది.
అలాగే వాము నీటిని తాగడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు వాము నీటిని తీసుకోవడం వల్ల నొప్పుల నుండి బయటపడవచ్చు. అలాగే ఈ నీటిని తాగడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన వివిధ రకాల సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు రోజూ ఉదయం వాము నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గోరు వెచ్చని వాము నీటిని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా వాము మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.