Kunda Biryani : కుండ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Kunda Biryani : చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బిర్యానీ ఒక‌టి. బిర్యానీ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ బిర్యానీల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో కుండ బిర్యానీ కూడా ఒక‌టి. కుండ‌లో చేసే ఈ బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు రెస్టారెంట్ ల‌ల్లో కుండ బిర్యానీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అచ్చం అదే రుచితో ఈ కుండ బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, అంద‌రికి న‌చ్చేలా, తేలిక‌గా కుండ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కుండ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, న‌ల్ల యాల‌కులు – 2, అనాస పువ్వు – 1, ల‌వంగాలు – 6, యాల‌కులు – 4, సాజీరా – ఒక టీ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, 30 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన‌ చికెన్ – అర‌కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, కొత్తిమీర త‌రుగు – రెండు టేబుల్ స్పూన్స్, పుదీనా త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, చిలికిన పెరుగు – అర క‌ప్పు, నీళ్లు- పావు క‌ప్పు, నిమ్మ‌కాయ – 1, నెయ్యి- పావు క‌ప్పు, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్.

Kunda Biryani how to make it tasty recipe in telugu
Kunda Biryani

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – రెండున్న‌ర లీటర్లు, యాల‌కులు – 6, ల‌వంగాలు – 5, సాజీరా – ఒక టీ స్పూన్, న‌ల్ల యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జాపత్రి – 1, మ‌రాఠి మొగ్గ – 1, ఉప్పు – 3 టీ స్పూన్స్, ప‌చ్చిమిర్చి – – 3, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, నిమ్మ‌ర‌సం – ఒక చెక్క‌, పెరుగు – అర క‌ప్పు, నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పు.

కుండ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా కుండ‌లో నూనె పోసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా వేయించాలి. త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని స‌గానికి పైగా వేయించిన త‌రువాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన త‌రువాత ప‌చ్చిమిర్చి, పెరుగు, కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. దీనిని 50 శాతం వ‌ర‌కు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చికెన్ ను ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు జార్ లో ప‌చ్చిమిర్చి, కొత్తిమీర‌, పుదీనా, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, పెరుగు, నిమ్మ‌ర‌సం వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో మ‌సాలా దినుసులు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. నీళ్లు మరుగుతున్న‌ప్పుడు బియ్యం వేసి క‌ల‌పాలి. దీనిని 60 శాతం వ‌ర‌కు ఉడికించిన త‌రువాత చిల్లుల గంటెతో వ‌డ‌క‌ట్టుకుంటూ ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ పై ఒక లేయ‌ర్ వేసుకోవాలి. త‌రువాత అన్నాన్ని మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించి మ‌రో లేయ‌ర్ గా వేసుకోవాలి. ఇలా మ‌రో 3 నిమిషాలు ఉడికించి మ‌రో లేయ‌ర్ గా వేసుకోవాలి. ఇప్పుడు మైదాపిండిని కుండ అంచుల చుట్టూ ఉంచాలి. త‌రువాత అన్నంపై 1/3 క‌ప్పు నీళ్లు, పావు క‌ప్పు నెయ్యి, కొత్తిమీర‌, ఫ్రైడ్ ఆనియ‌న్స్, పావు టీ స్పూన్ గ‌రం మ‌సాలా చ‌ల్లుకోవాలి. త‌రువాత మూత పెట్టి గ‌ట్టిగా వ‌త్తుకోవాలి.

ఇప్పుడు ఒక చోట పిండిని కొద్దిగా తీసి చిన్న రంధ్రం చేయాలి. ఈ కుండ‌ను స్ట‌వ్ మీద ఉంచి 15 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉంచాలి. త‌రువాత మ‌రో 3 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మ‌రో 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత మూత తీసి అంతా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కుండ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని రైతా, మిర్చి కా సాల‌న్ వంటి కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట‌కు వెళ్లే ప‌నిలేకుండా ఇలా ఇంట్లోనే కుండ బిర్యానీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts