Chia Seeds For Cholesterol : శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతే గుండె సంబంధిత సమస్యలు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. ఇది చివరకు హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్‌కు కారణమవుతుంది. కనుక అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి మనల్ని బయట పడేసేందుకు చియా సీడ్స్ ఎంతగానో పనిచేస్తాయని చెప్పవచ్చు. వీటిని రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ మొత్తం కడిగేసినట్లు క్లీన్ అవుతుంది.
చియా సీడ్స్‌లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. చియా విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. చియా విత్తనాల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విత్తనాల్లో ఫైబర్ కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సెడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్తనాళాలను రక్షిస్తాయి. వాపులు రాకుండా చూస్తాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. చియా విత్తనాలను నీటిలో నానబెడితే జెల్‌లా మారుతాయి. అప్పుడు వాటిని తీసుకోవాలి. అలా తింటేనే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
చియా విత్తనాలను నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడదు. ఫలితంగా హైబీపీ తగ్గుతుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది. చియా విత్తనాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. వీటి వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి. ప్రతి రోజూ సుఖ విరేచనం అవుతుంది. ఇక చియా విత్తనాలను నీటిలో ఎలా నానబెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌ను 200 ఎంఎల్ నీటిలో నానబెట్టాలి. వీటిని 1 నుంచి 2 గంటల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి. సమయం ఉంది అనుకుంటే రాత్రి నానబెట్టవచ్చు. ఉదయం తినవచ్చు. నీటిలో నానిన తరువాత ఈ విత్తనాలు జెల్ మాదిరిగా తయారవుతాయి. అప్పుడు వాటిని తినాలి. అనంతరం ఆ నీళ్లను తాగాలి. ఇలా చియా సీడ్స్‌ను నీటిలో నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మనం అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. అందువల్ల ఈ సీడ్స్ అందరికీ పనిచేస్తాయని చెప్పవచ్చు.