Soaked Garlic In Honey : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందుకనే సరైన ఆహారపు అలవాట్లను పాటించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాగే చాలా మంది రోజూ వ్యాయామం చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఇవి పాటిస్తే చాలదు.. ఆహారం విషయంలోనూ మనం చాలా ముఖ్యమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది. అలాంటి ఆహారాల్లో తేనె, వెల్లుల్లి ఎంతో ముఖ్యమైనవని చెప్పవచ్చు. ఈ రెండింటినీ రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి, తేనె రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల ఉదయం పరగడుపునే వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరం రక్షించబడుతుంది. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అందువల్ల వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే రక్త నాళాలు శుభ్రంగా మారుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు జరుగుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే పేగుల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల కేజీలకు కేజీల బరువు ఇట్టే తగ్గిపోతారు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక తేనెతో దీన్ని కలిపి తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది లేని వాళ్లకు షుగర్ రాకుండా ఉంటుంది. వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, దగ్గు, జలుబును తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమంలో యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. కనుక ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధులు త్వరగా తగ్గుతాయి. ఇక వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దంచాలి. ఈ మిశ్రమంలో ఒక టీస్పూన్ తేనెను బాగా కలిపి రాత్రంతా ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి. దీన్ని ఉదయం పరగడుపునే తినాలి. తరువాత 20 నిమిషాల వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు. ఈ విధంగా వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల దీన్ని రోజూ తింటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.