Cloves With Warm Water : లవంగాలు.. మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. వెజ్, నాన్ వెజ్ వంటల్లో ఈ లవంగాలను మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. లవంగాలు ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. కేవలం వంటల్లోనే కాకుండా సౌందర్య సాధనాలలో, ఔషధాల తయారీలో కూడా ఈ లవంగాలను ఉపయోగిస్తారు. నోటి దుర్వాసనను పోగొట్టడం నుండి కోతరువాత నీటిని ట్లు ఖర్చు పెట్టిన తగ్గని వ్యాధుల వరకు దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. లవంగాల్లో యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, అంటు వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో ఈ లవంగాలు మనకు ఎంతో తోడ్పడతాయి.
ఈ లవంగాలను ఎలా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉదయం పూట లేదా రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి దశలో ఉన్న వారు రోజూ లవంగాలు తినడం వల్ల క్యాన్సర్ బారి నుండి తప్పించుకోవచ్చని పలు పరిశోధనల్లో తేలింది. లవంగాలకు క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. దూర ప్రయాణాలు పడని వారు మనలో కొందరూ ఉంటారు. అలాంటి వారు ప్రయాణానికి ఒక గంట ముందు రెండు లవంగాలను తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడంతో పాటు వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
వర్షంలో తడిసిన, చల్లటి పదార్థాలను తిన్నా కొందరు వెంటనే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల బారిన పడతారు. అలాంటప్పుడు రోజుకు 3 నుండి 4 లవంగాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలోని విష పదార్థాలను, మలినాలను బయటకు పంపించడంలో కూడా ఈ లవంగాలు మనకు దోహదపడతాయి. తరచూ తలనొప్పితో బాధపడే వారు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడే వారు ఈ లవంగాల కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాలేయంతో వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారు లవంగాలను తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో, శరీరంలో మెటబాలిజాన్ని పెంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ లవంగాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి.
లవంగాల్లో ఉండే ఫినోలిక్ రసాయనాలు ఎముకలను రక్షిస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు, ఎముకలు గుళ్ల బారడం వంటి సమస్యలు తగ్గుతాయి. లవంగాలను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. టూత్ పేస్ట్ లలో కూడా లవంగాలను విరివిరిగా ఉపయోగిస్తారు. లవంగాలను వాడడం వల్ల దంతాల మరియు చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. దంతాలు ధృడంగా మారతాయి. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. పాలల్లో చిటికెడు లవంగాల పొడిని కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. నీటిలో లవంగాలను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయిన తరువాత గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
రెండు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే మద్యం తాగాలని కోరిక కూడా కలగకుండా ఉంటుంది. లవంగాలను, చందనంతో కలిపి మెత్తగా నూరి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, దురదలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పేస్ట్ ను చర్మం పై లేపనంగా రాయడం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. లవంగం నూనెలో దూదిని ముంచి దంతాల, చిగుళ్ల నొప్పి ఉన్న చోట ఉంచడం వల్ల నొప్పులు ఇట్టే తగ్గుతాయి. డయేరియా, నీళ్ల విరోచనాలతో బాధపడే వారు, రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ లవంగాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తరచూ లవంగాలను తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. లవంగం నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయడం వల్ల ఈగలు, దోమల సమస్య తగ్గడంతో పాటు చక్కటి వాసన కూడా వస్తుంది. అయితే లవంగాలు మేలు చేస్తాయి కదా వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. మోతాదుకు మించి ఈ లవంగాలను తీసుకుంటే దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కూడా వీటిని ఎక్కువగా ఇవ్వకూడదు. తగిన పరిమాణంలో ఈ లవంగాలను తీసుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.