షాంపు, హెయిర్ స్ప్రే, బాడీ క్రీములు ఇలా అందాన్నిచ్చే సౌందర్య ఉత్పత్తులను ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ముఖానికి క్రీములు, లిప్ స్టిక్స్, కళ్ళకు అందానిచ్చేవి ఇలాంటి లేకపోతే సగానికి సగంమంది బయటకు కూడా రావడం లేదు. ఇలా వీటిని మన శరీరానికి రాయడం వలన ఆ క్రీములతో పాటు కొన్ని రసాయనాలను మనం కొని తెచ్చుకుంటున్నాం. వీటిలో దాదాపు 500 రసాయనాలను మనం ఉపయోగిస్తున్నాం. అది ఒక కూడా ఒక డైలీ లైఫ్ లో 500 రసాయనాలను వాడుతున్నాం. మీరు విన్నది నిజమే మనం ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులతో ఒకరోజు 500 కెమికల్స్ ఉన్నాయట. మనం ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులలో ఉన్న కెమికల్స్ ఏ రేంజ్ లో ఎక్కడ ఉన్నాయో ఇక్కడ చూద్దాం: షాంపూ: ఇందులో 15 రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా సోడియంలారియెల్ సల్ఫేట్, ప్రోపోలైన్ గ్లైకాల్, టెట్రాసోడియం ఉంటాయి.చిరాకు, కళ్ళ సమస్యలు ఈ రసాయనాల వలన కలుగుతాయి.
హెయిర్ స్ప్రే: దీనివలన 11 రసాయనాలు మన శరీరంలోకి చేరుతాయి. ఆక్టినోక్సేట్, ఐసోఫతిలెట్స్ రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళు, గొంతు,దురదలు, హార్మోన్లు, కణాల నిర్మాణం మారిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. కనురెప్పల కోసం ఉపయోగించేవి: ఇందులో 26 రసాయనాలు ఉంటాయి. పాలిథీన్, టెరిఫెథిలేట్ ముఖ్యంగా ఉండే రసాయనాలు. క్యాన్సర్, సంతాన ప్రాప్తి లేకుండట, హార్మోన్ల మధ్య అంతరాయం, అవయవాలను దెబ్బ తీయడం వంటి దుష్ప్రభావాలు ముందు ముందు కలుగుతాయి. బుగ్గలను ఎర్రబరిచే క్రీము: వీటిలో 16 రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇథైల్ పారబెన్స్, మిథైల్ పారబెన్, ప్రొపైల్ పారబెన్ ఉంటాయి. దద్దుర్లు, హార్మోన్ల అంతరాయం, చికాకును కలిగిస్తాయి.
లిప్స్టిక్: ఇందులో 33 రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి పాలీమెంతైల్, మెథక్రైలేట్ ఉంటాయి. అలర్జీ మరియు క్యాన్సర్ కు దోహదం చేస్తాయి. బుగ్గలకింద: ఈ సౌందర్య ఉత్పత్తిలో మొత్తం 24 రసాయనాలు ఉంటాయి. పాలీమెంతైల్, మెథక్రైలేట్ కెమికల్స్ ముఖ్యంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను అంతరాయం చేయడం, దురదలు మరియు క్యాన్సర్ సమస్యలు దరిచేరుతాయి. గోళ్ళ రంగు: 33 రసాయనాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఫాథలేట్ ను వాడతారు. సంతానోత్పత్తి సమస్యలు,పిల్లల పెరుగుదల సమస్యలు తలెత్తుతాయి. దుర్గంధనాశని(డియోడరంట్): ఇందులో 15 కెమికల్స్ ఉంటాయి ముఖ్యంగా ఐసొప్రొపైల్,మిరిస్టేట్, సువాసనలు రావడానికి ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, కళ్ళు, ఊపిరితిత్తులు,తలనొప్పి, కళ్ళు తిరగడం, శ్వాసకోస సమస్యలు వచ్చి చేరతాయి.
పెర్ఫ్యూమ్(సువాసన ద్రవ్యము): ఇందులో 250 కెమికల్స్ ఉంటాయి. బెంజిల్ డైహేడ్ ఎక్కువగా వాడే రసాయనం. నోటి సమస్యలు, గొంతు, కళ్ళు,వాంతులు,కిడ్నీ సమస్యలు వస్తాయి. వెనుకభాగం సున్నితంగా ఉండటానికి: వీటిలో 22 రసాయనాలు ఉంటాయి. ఇథైల్ పారబెన్స్, మిథైల్ పారబెన్, ప్రొపైల్ పారబెన్ రసాయలను ఎక్కువగా వాడతారు. దద్దుర్లు, చికాకు, హార్మోన్ల అంతరాయం వంటి సమస్యలు వస్తాయి. శరీర ఔషదం: ఇందులో 22 కెమికల్స్ ఉంటాయి. ప్రోపోలైన్ గ్లైకాల్,మిథైల్ పారబెన్, ప్రొపైల్ పారబెన్ ఉంటాయి. పొయ్యి శుభ్రం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. దద్దుర్లు, హార్మోన్ల అంతరాయం,చిరాకు కలుగుతాయి.
సో.. చూశారుగా మన శరీరంలో రసాయనాలు ఎలా నిక్షిప్తమవుతున్నాయో. అయితే మన డైలీ లైఫ్ లో భాగమయిన వీటిని దూరం చేయడం కష్టమే అయినా, ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. అలాగే శరీరానికి హానికరం కాని సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడం ఇంకా మంచిది. అయితే వీటికి దూరంగా ఉండాలంటే ఏ మాత్రం రసాయనాలు సహజసిద్ధమైన లేదా కృత్రిమ సౌందర్య ఉత్పత్తులను వాడటం శ్రేయస్కరం. అలాగే మనం ఉపయోగించే ఉత్పత్తులపై ఏ ప్రాడక్ట్ వలన ఎన్ని రసాయనాలు చేరతాయో వాటిపై లేబుల్స్ రూపంలో పొందుపరచి ఉంటారు. అందుకని శరీరానికి హాని కలిగించే సౌందర్య ఉత్పత్తులను వదిలేసి, ఆరోగ్యకరమైన సహజ సౌందర్యాన్ని అందించే ఉత్పత్తులను ఉపయోగించండి. అందంగా, ఆరోగ్యంగా ఉండండి.