Dry Amla For Young Age : భోజ‌నానికి ముందు ఒక్క కాయ తింటే చాలు.. 100 ఏళ్లు వ‌చ్చినా య‌వ్వ‌నంగా ఉంటారు..!

Dry Amla For Young Age : ఉసిరికాయ‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఉసిరికాయ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఆహార ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. ఉసిరికాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఉసిరికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఆయుర్వేదంలో విరివిరిగా ఉప‌యోగించే త్రిఫ‌లాల్లో ఉసిరికాయ కూడా ఒక‌టి. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. ఉసిరికాయ‌లో ఫైబ‌ర్, క్యాల్షియం, ఐర‌న్, మెగ్నీషియం, ఫాస్ఫ‌ర‌స్, పొటాషియం, సోడియం, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ప‌చ్చి ఉసిరికాయ‌ల‌తో పాటు ఎండిన ఉసిరికాయ‌ల్లో కూడా ఈ పోష‌కాలు ఉంటాయి.

ఉసిరి కాయ‌ల‌ను ఎండ‌బెట్టి మ‌నం సంవ‌త్స‌రం పొడ‌వునా తీసుకోవ‌చ్చు. అలాగే ఈ ఉసిరికాయ‌ల‌తో జామ్ ను చేసి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ జామ్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. దీని కోసం 100 గ్రాముల ఎండు ఉసిరికాయ‌ల‌ను తీసుకోవాలి. వీటిని అర లీట‌ర్ నీటిలో వేసి మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో అర‌కిలో బెల్లం తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నీటిని పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగి తీగ పాకం వ‌చ్చిన త‌రువాత ఉడికించిన ఉసిరికాయ పేస్ట్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని జామ్ లాగా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

Dry Amla For Young Age take daily before meals
Dry Amla For Young Age

ఇలా చేయ‌డం వ‌ల్ల ఉసిరికాయ జామ్ త‌యార‌వుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయ‌డం వ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఈ జామ్ ను ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల మోతాదులో రోజూ తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కాలేయం ప‌నితీరు మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ జామ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది.

చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మంపై ముడ‌త‌లు తొల‌గిపోతాయి. వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. నిత్య య‌వ్వనంగా ఉండ‌వ‌చ్చు. ఈ విధంగా ఉసిరికాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని ఏ రూపంలో తీసుకున్నా కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts