Fat Burning Oil : ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. అధిక బరువుతో పాటు శరీరంలో పొట్ట, తొడలు, పిరుదులు, చేతులు వంటి భాగాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. అధిక బరువు సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లను ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చాలా మంది ఈ సమస్య బారినుండి బయట పడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో ఉండే పదార్థాలతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
అలాగే ఈ నూనెను వాడడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఈ ఫ్యాట్ బర్నింగ్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 50 ఎమ్ ఎల్ ఆవ నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో 20 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనెను కలపాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ వామును, రెండు ఇంచుల దాల్చిన చెక్కను ముక్కలుగా చేసి వేయాలి. చివరగా ఇందులో 4 లేదా 5 కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెను చిన్న మంటపై 8 నుండి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నూనె వేడయ్యేటప్పుడు ఇందులో నుండి నురుగు ఎక్కువగా వస్తుంది. ఇలా వేడి చేసిన తరువాత ఈ నూనెను వడకట్టి వేరొక పాత్రలోకి తీసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న నూనెనుచెలా వాడాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడం కంటే ఈ నూనెను ఎలా ఉపయోగించామన్నదే చాలా ముఖ్యం. ఈ నూనెను సరిగ్గా వాడకపోతే మంచి ఫలితాలను పొందలేము. ఇలా తయారు చేసుకున్న నూనెను మనం ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు.ఇప్పుడు ఈ నూనెను తగిన మోతాదులో వేరే గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఈ గిన్నెను నూనె వేడయ్యే వరకు వేడి నీటిలో ఉంచాలి. నూనె వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని వేసి కలపాలి. చాలా చేయడం వల్ల ప్యాట్ బర్నింగ్ ఆయిల్ తయారవుతుంది.
ఈ నూనెను చేత్తో తీసుకుని శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో చర్మం మీద రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. తరువాత వేడి బయటకు పోకుండా నూనె రాసిన భాగాన్ని కాటన్ వస్త్రంతో చుట్టాలి. దీనిని మూడు నుండి నాలుగు గంటల పాటు అలాగే ఉంచాలి. తరువాత గోరు వెచ్చని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ఈ విధంగా ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ నూనెను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.