Fennel Cumin Coriander Seeds : మన ఇంట్లో ఉండే మూడు పదార్థాలను ఉపయోగించి ఒక చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల 100కు పైగా రోగాలను దూరం చేసుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల దాదాపు 90 కు పైగా రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో విపరీతమైన వేడి, థైరాయిడ్, నరాల బలహీనత, సయాటికా, అరికాళ్లల్లో మంటలు, షుగర్, రక్తనాళాల్లో అడ్డంకులు, కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ చిట్కా అద్భుతంగా పని చేస్తుంది. ఈ చిట్కా సహజ సిద్దమైనది కనుక దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ఎక్కువగా ఖర్చు కూడా అవ్వదు. చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఈచిట్కాను వాడడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.
అధిక రక్తపోటు సమస్య అదుపులోకి వస్తుంది. స్లిప్ డిస్క్ వంటి సమస్యలు తగ్గుతాయి. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన ఆ మూడు పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ వేయించిన ధనియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. నరాల్లో ఉండే అడ్డంకులను తొలగించడంలో, నరాల బలహీనతను తగ్గించడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, సయాటికా నొప్పులను ధనియాలు అద్భుతంగా పని చేస్తాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి 12, విటమిన్ కె, బీటా కెరోటీన్ వంటి ఎన్నో పోషకాలు ధనియాల్లో ఉంటాయి. ఇక మనం ఉపయోగించాల్సిన రెండో పదార్థం వేయించిన జీలకర్ర.
రక్తహీనతను తగ్గించడంలో, రక్తనాళాల్లో అడ్డంకులు తొలగించడంలో, అధిక బరువును తగ్గించడంలో, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా జీలకర్ర మనకు సహాయపడుతుంది. ఇక చివరగా మనం ఉపయోగించాల్సిన పదార్థం సోంపు గింజలు. కంటి చూపును మెరుగుపరచడంలో, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో వేడిని తగ్గించడంలో, క్యాల్షియం లోపాన్ని తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా సోంపు గింజలు మనకు సహాయపడతాయి. ఈ మూడు పదార్థాలతో మనం ఒక టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి.
తరువాత ఇందులో అర టీ స్పూన్ సోంపు గింజలు, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర, అర టీ స్పూన్ వేయించిన ధనియాలు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని స్టవ్ మీద ఉంచి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో పటిక బెల్లాన్ని లేదా తేనెను వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టీ ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఈ విధంగా ఇంట్లో ఉండే పదార్థాలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.