Instant Soft Idli : మెత్త‌ని మృదువైన ఇడ్లీల‌ను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడే ఇలా చేసుకోవ‌చ్చు..!

Instant Soft Idli : ఇడ్లీలు.. మ‌న అల్పాహారంగా తీసుకునే ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ప‌ప్పును నాన‌బెట్టి రుబ్బి ఇడ్లీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఎటువంటి ప‌ప్పును నాన‌బెట్టే ప‌ని లేకుండా పిండి రుబ్బే ప‌ని లేకుండా అర‌గంట‌లోనే రుచిక‌ర‌మైన మెత్త‌టి ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా మెత్త‌టి, రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొడ్డు అటుకులు – ఒక క‌ప్పు , ఇడ్లీ ర‌వ్వ – ఒక క‌ప్పు, పెరుగు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – ఒక టీ స్పూన్.

Instant Soft Idli recipe you can make them very easily
Instant Soft Idli

ఇన్ స్టాంట్ ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా ఒక ర‌వ్వ‌ను తీసుకుని శుభ్రండా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి ప‌ది నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత మ‌రో గిన్నెలో అటుకులను తీసుకోవాలి. వీటిని కూడా శుభ్రంగా క‌డిగిన త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ అటుకుల‌ను కూడా ప‌ది నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. ఇలా నాన‌బెట్టుకున్న త‌రువాత అటుకుల‌ను ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో అర క‌ప్పు నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ర‌వ్వ‌లో ఉండే నీటిని తీసేసి ర‌వ్వ‌ను గ‌ట్టిగా పిండుతూ మిక్సీ ప‌ట్టుకున్న‌ అటుకుల మిశ్ర‌మంలో వేసి క‌ల‌పాలి. పిండి మ‌రీ గ‌ట్టిగా ఉంటే కొద్దిగా నీటిని పోసి క‌ల‌పాలి.

త‌రువాత ఉప్పు, వంట‌సోడా వేసి వంట‌సోడాపై ఒక టీ స్పూన్ నీటిని పోయాలి. త‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్క‌ర్ లో నీటిని పోసి మూత పెట్టి వేడి చేయాలి. ఇడ్లీ ప్లేట్ ల‌లో పిండిని వేసుకోవాలి. త‌రువాత ఈ ప్లేట్ లను కుక్క‌ర్ లో ఉంచి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఇడ్లీల‌ను బ‌య‌ట‌కు తీసి కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత ప్లేట్ లో వేసుకుని చ‌ట్నీ, సాంబార్ తో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీలు త‌యార‌వుతాయి. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు అటుకుల‌తో రుచిక‌ర‌మైన మెత్త‌టి ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు.

D

Recent Posts