హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ కంప్యూట‌ర్‌లా వేగంగా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..

బ్రెయిన్ పవర్ ని పెంచుకోవాలి అంటే సులువుగా ఈ టిప్స్ ని అనుసరించి పెంచుకోవచ్చు. అయితే వీటి కోసం పూర్తిగా చూసేయండి. కాఫీ తాగడం చాలా మంచిది. కాఫీ లో ఉండే కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మీ బ్రెయిన్ కి సహాయం చేస్తాయి. కాఫీని ఎక్కువకాలం తాగడం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు రావు. పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి రోగాలు కూడా మీ దరి చేరవు. కమలాలు, ద్రాక్ష పండ్లు, నిమ్మ కాయలు, బ్లాక్ గ్రేప్స్‌ వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పైగా ఇవి ఒత్తిడిని, డిప్రెషన్ మరియు వయసుకు సంబంధించిన బ్రెయిన్ డిజనరేషన్ అయిన అల్జీమర్, డిమెన్షియా మొదలైన వాటిని తగ్గిస్తాయి. బాదం బ్రెయిన్ కి సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీనిలో న్యూట్రిషియన్స్ అధికంగా ఉంటాయి. బాదం లో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. అలానే దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు పాలీఫినాల్స్ బ్రెయిన్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిని తగ్గించడంలో బాదం బాగా సహాయపడుతాయి. అలానే ఇది ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. బ్రెయిన్ హెల్త్ కోసం బాదం తప్పకుండా తీసుకోండి.

బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. బ్రెయిన్ హెల్త్ కి ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి మీకు దొరికినప్పుడల్లా బ్లూ బెర్రీస్ ను కూడా తీసుకోండి. డార్క్ చాక్లెట్ మరియు కోకో పౌడర్ కూడా బ్రెయిన్ హెల్త్ కు బాగా ఉపయోగపడుతుంది దానిలో ఉండే ఫ్లేవనోయిడ్స్ కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మెమరీని పెంచుతుంది మరియు మూడ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది.

follow these tips to make your brain work quickly follow these tips to make your brain work quickly

గ్రీన్ టీ బ్రెయిన్ కి మంచి సపోర్ట్ ఇస్తుంది. దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. అలానే మీరు రిలాక్స్ గా ఉండడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగ పడుతుంది.

Admin

Recent Posts