Foods For Waist Size : నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. చాలా మందికి నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలు. అయితే కొందరిలో శరీరమంతా సాధారణంగా ఉన్నప్పటికి కేవలం నడుము భాగం మాత్రమే లావుగా కనిపిస్తుంది. అలాంటి వారు నడుము కొలతను తగ్గించుకోవడానికి నడుముకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఇలా వ్యాయామాలు చేయడంతో పాటు గింజలను కూడా తీసుకోవడం వల్ల నడుము చుట్టూ ఉండే కొవ్వు మరింత వేగంగా కరుగుతుందని అలాగే శరీర బరువు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గింజలను తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. శరీర బరువును తగ్గించడంతో పాటు నడుము కొలతను తగ్గించే గింజలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో వాల్ నట్స్ కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల గుండెకు, మెదడుకు ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో కొవ్వులు ఉన్నప్పటికి వీటిని మితంగా తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే బాదంపప్పులను తీసుకోవడం వల్ల కూడా మనం నడుము చుట్టూ ఉండే కొవ్వును కరిగించుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. మనకు త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటాము. తద్వారా మన శరీర బరువు తగ్గుతుంది. అలాగే ఎంతో రుచిగా ఉండే జీడిపప్పును తీసుకోవడం వల్ల కూడా మనం నడుము చుట్టుకొలతను తగ్గించుకోవచ్చు.
జీడిపప్పులో ఆరోగ్యకరమైన మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అలాగే ఫైబర్, ప్రోటీన్ కూడా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. కనుక వీటిని చిరుతిండిగా తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే పిస్తాపప్పును తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇతర గింజలతో పోల్చినప్పుడు పిస్తా పప్పులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు క్యాలరీలు కూడా తక్కువగా అందుతాయి. కనుక మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే మకాడమియా గింజలను తీసుకోవడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. వీటి యొక్క గ్లెసెమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు.
అదే విధంగా బ్రెజిల్ గింజలు కూడా మనకు బరువు తగ్గడంలో సహాయపడతాయి. బ్రెజిల్ గింజలల్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ వేగం పెరుగుతుంది. తద్వారా మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఇక హాజెల్ నట్స్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలగడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చు. వీటిలో సంతృప్త కొవ్వులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో మనం బరువు తగ్గడానికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే పెకాన్లను తీసుకోవడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో మంటను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి. పెకాన్లల్లో శక్తి అధికంగా ఉంటుంది. వీటిని మితంగా తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా ఈ గింజలను తీసుకుంటూ, సరైన ఆహార నియమాలను పాటిస్తూ, వ్యాయామాలు చేయడం వల్ల మనం సులభంగా నడుము చుట్టూ ఉండే కొవ్వును కరిగించుకోవచ్చని , ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.