Garlic Peels : మనం సాధారణంగా వంటల్లో వెల్లుల్లి రెమ్మలను వాడుతూ ఉంటాము. వెల్లుల్లి రెమ్మలల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆయుర్వేద నిపుణులు కూడా ఈ వెల్లుల్లి రెమ్మలను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే మనం సాధారణంగా వెల్లుల్లి రెమ్మలపై ఉండే పొట్టును తీసి వెల్లుల్లి రెమ్మలను వాడుతూ ఉంటాము. ఈ వెల్లుల్లిని పొట్టును మనం చెత్తగా భావించి పడేస్తూ ఉంటాము. కానీ వెల్లుల్లి పొట్టులో కూడా ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లి పొట్టును వాడడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. వెల్లుల్లి పొట్టులో ఉండే పోషకాలు అలాగే ఈ పొట్టును వాడడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి పొట్టులో ఫినైల్ ప్రోపనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఎర్రబడిన చర్మం, చర్మంపై దురద వంటి సమస్యలతో బాధపడే వారు వెల్లుల్లి పొట్టుతో చేసిన టానిక్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి పొట్టులో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి మనకు దోహదపడతాయి. అలాగే ఈ పొట్టును మనం తినలేము కనుక సూప్, చారు, పులుసు వంటి వాటిలో ఈ పొట్టును వేసి ఉడికించాలి. తరువాత పొట్టు తీసేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు అదనంగా పోషకాలు అందుతాయి. వెల్లుల్లి పొట్టును నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత వడకట్టి ఈ నీటిని తాగాలి. రోజూ నిద్రపోయే ముందు ఈ నీటిని తాగడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. అలాగే వెల్లుల్లి పొట్టులో విటమిన్ ఎ, సి, ఇ, క్వెర్సెటిన్ వంటి పోషకాలు ఉంటాయి.
ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మనకు సహాయపడతాయి. వెల్లుల్లి పొట్టును వాడడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే వెల్లుల్లి పొట్టులో సల్ఫర్ అధికంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో ఇది మనకు ఎంతో దోహదపడుతుంది. అలాగే అన్నం వండేటప్పుడు వెల్లుల్లి పొట్టు వేసి ఉడికించి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి పొట్టులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ విధంగా వెల్లుల్లి పొట్టు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కనుక ఇప్పటి నుండి ఈ పొట్టును పడూయకుండా తగిన విధంగా వాడుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.