హెల్త్ టిప్స్

Health : అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు..!

Health : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్పినవి లేదంటే ఎక్కడైనా చదివినవి పాటిస్తూ ఉంటారు. ఈ ఆరోగ్య చిట్కాలను కనుక పాటించారంటే మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. పైగా చిటికెలో పలు సమస్యలని మనం దూరం చేసుకోవచ్చు. ఈ అనారోగ్య సమస్యలకి చిటికెలో పరిష్కారం కనబ‌డుతుంది. కడుపు నొప్పిగా ఉంటే ఇంగువ నీళ్లు కొంచెం బొడ్డు మీద ఉంచండి. ఇలా చేయడం వలన కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.

కడుపునొప్పితో బాధపడే వాళ్ళు 10 గ్రాములు యాలకుల పొడిని నీళ్లల్లో కలిపి కానీ లేదంటే యాల‌కులని నానబెట్టి గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. చాలామంది చేదుగా ఉంటుందని కాకరకాయని దూరం పెడుతూ ఉంటారు. కనీసం వారానికి ఒక్కసారైనా కాకరకాయను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా కనీసం నెలకి ఒక సారి ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేయడం మంచిది. అలా చేయడం వలన చర్మ సమస్యలు రావు.

health tips for all

పైగా పసుపు రాసుకుని స్నానం చేస్తే శరీరం మీద ఉండే అవాంచిత రోమాలు పోతాయి. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి పసుపు రాసుకుని స్నానం చేస్తే ఇంకా మంచిది. కళ్ళ కలకలు వచ్చినట్లయితే దూదిని ధనియాలని నానబెట్టిన నీళ్లల్లో ముంచి కళ్ళని తుడిస్తే చక్కటి రిలీఫ్ ని పొందొచ్చు.

తులసి ఆకుల రసాన్ని కనుక కంటి మీద రాస్తే కళ్ళు నీరు కారడం, కళ్ళ మంటలు వంటి బాధల నుండి బయటపడొచ్చు. కాలిన మచ్చలకి తేనె రాస్తే మచ్చలు అన్నీ కూడా సులభంగా పోతాయి. కాళ్లు, చేతులు బెణికితే ఉప్పుతో కాపడం పెడితే ఉపశమనంగా ఉంటుంది. ఇలా ఈ సమస్యలకి సులభంగా పరిష్కారాన్ని పొందవచ్చు.

Admin

Recent Posts