హెల్త్ టిప్స్

Walking Without Shoes : వారానికి ఒక‌సారైనా చెప్పుల్లేకుండా వాకింగ్ చేయాల‌ట‌.. ఎందుకో తెలుసా..?

Walking Without Shoes : ఆధునిక కాలం, మోడ్రన్ స్టైల్ పేరుతో పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగుతున్న కాలం ఇది. ఇంట్లో మొత్తం నున్నని పాలిష్ బండలు, ఇంకా స్మూతైన చెప్పులు.. ఎక్కడా పాదాలకు గరుకు తగిలేది లేదు. ఉదయం బెడ్ మీద నుండి దిగింది మొదలు, మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు, వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్, కాకుంటే స్పోర్ట్స్ షూస్.. ఇంకా అయితే ఫార్మల్ షూస్.. ఇలా టైమ్ ను బట్టి ఏదో ఒక‌ పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం.

ఇది ఏమాత్రం ఒంటికి మంచిది కాదని చాలా మందికి తెలియదు. మన పూర్వీకులు నిరంతరం గతుకుల రోడ్లల్లో, పొలం గట్ల వెంబడి చెప్పుల్లేకుండా తిరగడం మూలాన ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. స్ట‌యిల్ పేరుతో బెడ్ రూం లోకి కూడా చెప్పులొచ్చేశాయ్. ఇలాచేసి పాదాలను రక్షిస్తున్నామని అనుకుంటున్నాం గానీ శరీరానికి శిక్ష వేసుకుంటున్నామని చాలా మందికి తెలియదు. ఇప్పటి నుంచైనా ఇక మీదట వారానికి ఒక‌సారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయండి. లేదంటే మీ ఆరోగ్యం డేంజర్ లో పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వారానికి ఒక‌సారి చెప్పుల్లేకుండా ఒక కిలోమీట‌ర్ దూరం న‌డ‌వ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది. నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా గుచ్చుకోవడం ద్వారా మీ బీపీ కంట్రోల్ అవుతుంది. ఏదో కొత్త స్పర్శను కాలి పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. సహనం పెరుగుతుంది. ఓపిక వ‌స్తుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను పొందుతారు.

walking without footwear very beneficial to us

మానవుని పాదాల్లో 72వేల నరాల చివ‌ర్లు ఉంటాయి. ఎక్కువసేపు పాదరక్షలు వాడడం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయి. కాబట్టి ఇక మీదట పార్క్ లలో, ఆపీస్ లలో, ఇంట్లో.. చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఏ వయసు వారు ఎంతదూరం న‌డ‌వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 40 సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారు ప్రతి రోజూ కనీసం 3.75 కిలోమీటర్లు నడవాలి. 45 సంవత్సరాల‌ నుంచి 50 సంవత్సరాల‌ వరకు వయస్సు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 3.5 కిలోమీటర్లు నడవాలి. 50 సంవత్సరాల‌ నుంచి 55 సంవత్సరాల‌ వరకు వయస్సు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 3.1 కిలోమీటర్లు నడవాలి. 55 సంవత్సరాల‌ నుంచి 60 సంవత్సరాల‌ వరకు వయస్సు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 2.8 కిలోమీటర్లు నడవాలి.

60 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతి రోజు కనీసం 2.5 కిలోమీటర్లు నడవాలి. ఒక సర్వే ప్రకారం ఏ మనిషి అయితే ప్రతి వారం కనీసం 2 గంటలు నడుస్తాడో అతనికి 40 శాతం మిగ‌తా వారికన్నా వ్యాధులు వ‌చ్చేందుకు త‌క్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఒంట్లోని కొవ్వు కరుగుతుంది. మన రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. రోజూ నడవడం వలన మధుమేహం రాకుండా ఉంటుంది. రోజూ వాకింగ్, ఇత‌ర వ్యాయామాలు చేస్తే హార్ట్ ఎటాక్ లాంటివి రావడానికి అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక రోజూ న‌డ‌క‌ను అల‌వాటు చేసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts