Kitchen Items : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలన్నా మనం చక్కటి ఆహారాన్ని తీసుకోవాలన్నా సంగతి మనకు తెలిసిందే. అయితే కేవలం పోషకాలు కలిగిన ఆహారమే కాకుండా ఆహారాన్ని వండే వంటగది కూడా శుభ్రంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వంటగది శుభ్రంగా ఉండడం వల్లే మనం తీసుకునే ఆహారం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చాలా మంది వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటారు. అయితే వంటగదిలో కొన్ని వస్తువులను మాత్రం మనం రోజూ శుభ్రం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ వస్తువులల్లో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని కనుక వీటిని రోజూ తప్పకుండా శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వంటగదిలో రోజూ తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వంటగదిలో ఉండేవాటిలో స్పాంజ్ కూడా ఒకటి. ఈ స్పాంజ్ ను రోజూ శుభ్రం చేసుకోవాలి. దీనిలో ఇకోలీ మరియు సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక దీనిని రోజూ శుభ్రం చేసుకోవాలి. స్పాంజ్ ను నీటిలో నానబెట్టి బ్లీచ్ చేయాలి. తరువాత ఒక నిమిషం పాటు మైక్రోవేవ్ చేయడం వల్ల హానికారక బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే వంటగదిలో ఉండే కౌంటర్ టాప్ లను కూడా రోజూ శుభ్రం చేసుకోవాలి. వీటిపై కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వంట చేయడానికి ముందు వీటిని బ్యాక్టీరియాలను నశింపజేసే స్ప్రేలతో తుడిచి ఆ తరువాత ఆహారాన్ని సిద్దం చేసుకోవాలి. అలాగే చాలా మంది రోజూ చపాతీలను, రోటీలను తయారు చేస్తూ ఉంటారు. రోటీలను తయారు చేసే ఈ రోటీ కర్రను కూడా రోజూ శుభ్రం చేసుకోవాలి. దీనిని చెక్కతో తయారు చేస్తారు కనుక దీనిపై బ్యాక్టీరియా నిల్వ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కనుక రోటీ కర్రను కూడా రోజూ శుభ్రం చేసుకోవాలి. వీటితో పాటు ఉప్పు, మిరియాల పొడి ఉంచే షేకర్స్ ను కూడా రోజూ శుభ్రం చేసుకోవాలి. వీటిని ఎక్కువగా తాకుతూ ఉంటాము. మన చేతులకు ఉండే బ్యాక్టీరియా వీటిపై ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని తడి గుడ్డతో తుడవడం, వేడి నీటితో తుడవడం వంటివి చేయడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే మైక్రోవేవ్ ను కూడా శుభ్రం చేసుకోవాలి. మైక్రోవేవ్ లో జిడ్డు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో బ్యాక్టీరియా వృద్ది చెందే అవకాశం ఉంటుంది. కనుక సబ్బు నీటిలో, వెనిగర్ తో ప్రతిరోజూ మైక్రోవేవ్ లోపలి భాగాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. అదే విధంగా మనం నీటిని తాగే వాటర్ బాటిల్స్ ను కూడా రోజూ శుభ్రం చేసుకోవాలి. వీటిపై బ్యాక్టీరియా ఎక్కువగా పేరుకుపోతుంది. కనుక వేడి నీటితో, సబ్బు నీటితో వీటిని రోజూ కడగాలి.
ఇలా కడిగిన తరువాత తడి పోయే వరకు గాలిలో ఆరబెట్టాలి. మనం కూరగాయలను, పండ్లను కట్ చేసే కట్టింగ్ బోర్డులను కూడా రోజూ శుభ్రం చేసుకోవాలి. కూరగాయలు, పండ్ల నుండి వచ్చే బ్యాక్టీరియా బోర్డ్ పై పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కనుక వేడి నీటితో లేదా సబ్బు నీటితో వీటిని రోజూ శుభ్రం చేస్తూ ఉండాలి. వంటగదిలో ఉండే సింక్ ను కూడా రోజూ శుభ్రం చేస్తూ ఉండాలి. సింక్ లో బ్యాక్టీరియా వృద్ది చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వెనిగర్, క్రిమిసంహారక క్లీనర్స్ తో సింక్ ను రోజూ శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే గిన్నెలను, ప్లేట్స్ ను తుడిచే క్లాత్ లను కూడా రోజూ శుభ్రం చేసుకోవాలి. వీటిపై ఆహార కణాలు పేరుకుపోయి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. సబ్బు, వేడి నీటితో వీటిని శుభ్రం చేస్తూ ఉండాలి. ఈ విధంగా వంటగదిలో ఉండే ఈ వస్తువులను రోజూ తప్పకుండా శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.