Junnu Health Benefits : పాల నుడి తయారయ్యే రుచికరమైన పదార్థాల్లో జున్ను కూడా ఒకటి. జున్ను రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. జున్నును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఆవు లేదా గేదె దూడలను జన్మించినప్పుడు వచ్చే పాలతో జున్నును తయారు చేస్తారు. బెల్లం లేదా పంచదార, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి ఈ జున్నును తయారు చేస్తూ ఉంటారు. జున్నును తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జున్నులో కూడా దాదాపు పాలల్లో ఉండే పోషకాలు ఉంటాయి. జున్నును తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత క్యాల్షియం, విటమిన్ డి లభిస్తుంది. దీంతో ఎముకలు, దంతాలు ధృడంగా, ఆరోగ్యంగా మారతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. జున్నును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. జున్నును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం బలంగా తయారవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్పెక్షన్స్ మన దరి చేరకుండా ఉంటాయి. మన శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో జున్ను ఎంతో దోహదపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. నీరసం, బలహీనత వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. జున్నును తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి.
చర్మం పొడిబారకుండా అందంగా ఉంటుంది. ఈ విధంగా జున్ను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో షాపుల్లో జున్ను పొడి లభిస్తుంది. కల్తీ చేసిన జున్ను పొడిని కూడా మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇలా కల్తీ జున్ను పొడితో జున్ను తయారు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలగకపోగా మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.