హెల్త్ టిప్స్

రాత్రిపూట ఈ 2 ప‌నులు చేశారంటే చాలు.. ప‌డుకున్న వెంట‌నే 1 నిమిషంలోనే నిద్ర‌లోకి జారుకుంటారు..!

ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి కూడా ఒక‌టి. నిద్ర‌లేమి కార‌ణంగా చాలా మంది అవ‌స్థ ప‌డుతున్నారు. రాత్రిపూట ఎప్పుడో ఆల‌స్యంగా నిద్రపోతున్నారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం కూడా చాలా ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. అయితే నిద్ర‌లేమి వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ రాత్రి పూట 2 చిన్న ప‌నులు చేస్తే ప‌డుకున్న వెంట‌నే 1 నిమిషంలోనే గాఢ నిద్ర‌లోకి జారుకోవ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రి ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

రాత్రిపూట మెడిటేష‌న్ చేయ‌డం ద్వారా నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. బెడ్‌రూమ్‌లో బెడ్‌పై లేదా కింద నేల‌పై ఒక మ్యాట్ మీద కూర్చోవాలి. చుట్టూ ఎలాంటి శ‌బ్దాలు లేకుండా ప్ర‌శాంతంగా ఉండాలి. శ్వాస‌ను నెమ్మ‌దిగా బాగా ఎక్కువ సేపు పీల్చాలి. కాసేపు శ్వాస‌ను బంధించాలి. అనంత‌రం నెమ్మ‌దిగా శ్వాస‌ను వ‌ద‌లాలి. ఇలా 5 నిమిషాల పాటు చేయాలి. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది, ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. రాత్రి నిద్ర‌కు క‌నీసం 30 నిమిషాల ముందు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది. దీంతో చ‌క్క‌గా నిద్ర‌పోవ‌చ్చు. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

just do these 2 tings before bed for better sleep

ఇక రాత్రి పూట నిద్ర‌కు 30 నిమిషాల ముందే మీ ఫోన్లు లేదా ట్యాబ్‌ల‌ను వాడ‌డం మానేయాలి. టీవీ చూడ‌డం మానేయాల్సి ఉంటుంది. దీంతో కూడా మీ మైండ్ రిలాక్స్ అయి చ‌క్క‌గా నిద్ర‌ప‌డుతుంది. దీంతోపాటు రాత్రి పూట గోరు వెచ్చ‌ని పాల‌ను తాగినా లేదా క‌మోమిల్ టీని తాగినా చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. అయితే రోజూ రాత్రి ఒకే టైముకు నిద్రిస్తూ ఉద‌యం ఒకే టైముకు నిద్ర లేస్తుంటే ఈ లైఫ్ స్టైల్ అల‌వాటు అవుతుంది. దీంతో రాత్రి ఆ టైమ్ అవ‌గానే మీరు ఆపుకుందామ‌నున్నా నిద్ర ఆగ‌దు. వెంట‌నే నిద్ర‌లోకి జారుకుంటారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర‌లేస్తారు. క‌నుక ఈ అల‌వాట్ల‌ను పాటిస్తే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు.

Admin

Recent Posts