Kodo Millets : ఈ మిల్లెట్స్‌ను రోజూ తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Kodo Millets : నేటి త‌రుణంలో మ‌నలో చాలా మంది వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. చాలా మంది దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దీంతో అంద‌రికి ఆరోగ్యంపై శ్ర‌ద్ద పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో అంద‌రూ మ‌ర‌లా పాత‌కాలంలో ఎక్కువ‌గా తీసుకునే చిరుధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. రాగులు, స‌జ్జ‌లు, జొన్న‌ల‌తో పాటు మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన ఇత‌ర చిరుధాన్యాలల్లో అరికెలు కూడా ఒక‌టి. ఇత‌ర చిరుధాన్యాల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరికెల‌ల్లో కూడా ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. చిరుధాన్యాలైన అరికెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరికెల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అరికెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు తగ్గ‌వ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చాలా స‌మ‌యం వ‌ర‌కు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఇత‌ర ఆహారాల‌పైకి దృష్టి వెళ్ల‌కుండా ఉంటుంది. దీంతో మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో కూడా అరికెలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.

Kodo Millets or arikelu wonderful health benefits
Kodo Millets

అదే విధంగా షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు అరికెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అరికెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటాయి. అరికెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తగ్గుతుంది. ర‌క్తం శుద్ది అవుతుంది. ఎముకలు, కండ‌రాలు ధృడంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. అరికెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అరికెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా అరికెలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D