హెల్త్ టిప్స్

వేసవి కాలంలో దొరికే తాటి ముంజలు తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా …!

వేసవి కాలం ఇంకా రానేలేదు… ఎండలు మండిపోతున్నాయి. దీని నుండి బయటపడాలంటే చల్లగా ఏదో ఒకటి తాగాలి అనుకుని చాలా మంది కూల్ డ్రింక్లు, ఐస్ క్రీం లు, జ్యూస్ ల వైపు మొగ్గు చూపుతుంటారు. అవి తాత్కాలికంగా చల్ల బరచినా శరీరంలో ఉన్న వేడిని తగ్గించలేవు. సహజ సిద్దంగా ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీరు, తాటి ముంజలు, పుచ్చకాయలు, కర్భుజా వంటి వాటితో వేసవి తాపాన్ని తట్టుకోవచ్చు. ముఖ్యంగా తాటి ముంజల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

వేసవిలో తాటి ముంజలు విరివిగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇవి శరీరాన్ని చల్ల బరుస్తాయి. వీటిలో విటమిన్స్, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న అనవసర వ్యర్ధాలను బయటకు పంపుతాయి. దీని వల్ల శరీరం లోపల శుభ్ర పడుతుంది. ఈ ముంజలలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలిగి త్వరగా క‌లిగి ఆకలి వేయదు. తద్వారా త్వరగా బరువు తగ్గుతారు.

many wonderful health benefits of sugar palm fruit

ముఖ్యంగా వేసవిలో వీటిని తినడం వల్ల అలసట, నీరసం రాకుండా కాపాడుతుంది. మల బద్ధక సమస్య వారికి ఈ తాటి ముంజలు మంచి నివారణగా ఉపయోగపడతాయి. రోజు వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడటమే కాక ఎసిడిటి, గ్యాస్ సమస్యలను రాకుండా చేస్తుంది. గర్భిణులు వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగానే కాక సౌందర్య సాధనంగా కూడా ఇవి పనిచేస్తాయి. వీటిని తరచు తినడం వల్ల ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు పోయి నిగారింపు గా ఉంటుంది.

Admin

Recent Posts